గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి
బళ్లారిటౌన్: గర్భిణి సీ్త్రలకు ఆరోగ్య పరీక్షలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను నిరంతరం చురుగ్గా కొనసాగాలని డీహెచ్‌ఓ డాక్టర్ వై.రమేష్ బాబు పేర్కొన్నారు. గురువారం సిరుగుప్ప తాలూకా తెక్కలకోటలోని సముదాయ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అక్కడ గర్భిణి సీ్త్రలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి మాట్లాడారు. అంతేగాక ఆస్పత్రి వైద్యులు నిర్వహిస్తున్న కార్యవైఖరిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భిణి సీ్త్రలతో పాటు పిల్లల ఆరోగ్య సేవలపై కూడా దృష్టి సారించాలన్నారు. గర్భిణులకు పౌష్టిక ఆహారం, శిశువులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు, తల్లి పాలపై అవగాహన కల్పించడం, పిల్లల్లో ఏదైనా రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రులకు తీసుకురావాలన్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఊపిరి ఆడటంలో సమస్య ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకురావాలని సూచించారు. తొలి కాన్పు మహిళలు ఎత్తు, బరువు, బీపీ, రక్తంలో ఐరన్ కొరత, కవల పిల్లలు కలిగిన గర్భిణులపై ప్రత్యేక శద్ధ వహించడంపై వైద్యులు ఆసక్తి కనబరచాలన్నారు. మొదటి కాన్పు సిజేరియన్ చేపడితే మూడేళ్ల వరకు తప్పనిసరిగా పిల్లలు కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇందు కోసం చుక్కల మందు, కాపర్ టీ, నిరోధ్ వంటివి వాడాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పాలన వైద్యాధికారి టి.రామకృష్ణ, గైనకాలజిస్టులు శారద, అరుణ్‌కుమార్, ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్ కాశిం తదితరులు పాల్గొన్నారు.


