జోరుగా అగ్నివీర్ నియామక ర్యాలీ
సాక్షి బళ్లారి: దేశ భద్రత, రక్షణ కోసం దేశభక్తితో పరితపించే యువతకు కేంద్ర ప్రభుత్వం భారత సైన్యంలో పని చేసేందుకు అగ్నివీర్ సేనా ర్యాలీ పేరుతో నిర్వహించిన నియామక పోటీలకు యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. గురువారం నగరంలోని జిల్లా క్రీడా మైదానంలో సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అర్హత కలిగిన యువతకు పోటీ పరీక్షలు చేపట్టారు. ఉమ్మడి బళ్లారి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి అర్హత కలిగిన యువత కదిలివచ్చి తమ విద్యాభ్యాస దాఖలాలను అధికారులకు అందజేశారు. భారత సైన్యంలో పని చేసేందుకు కావాల్సిన అన్ని రకాల దేహదారుఢ్య పరీక్షలు, పరుగు పందెం తదితర పరీక్షలను యువతకు చేపట్టారు.
జోరుగా అగ్నివీర్ నియామక ర్యాలీ


