సేద్యం.. సుసాధ్యం
బనశంకరి: సమృద్ధి వ్యవసాయం, వికసిత భారత్, నేల– జలం, పంటలు నినాదంతో బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణలో రైతు మేళా గురువారం నుంచి ఆరంభమైంది. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎన్.చలువరాయస్వామి ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక ఉపకరణాలు ఇందులో కొలువుదీరాయి. పశుపోషణ, పట్టు, తేనెటీగలు, చేపల పెంపకం గురించి సమాచారం లభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన స్టాళ్లు అనేకం వెలిశాయి. కొత్తరకం వ్యవసాయ యంత్రోపకరణాలను ప్రదర్శనలో చూడవచ్చు. జీకేవీకే తరఫున ఈసారి జొన్నలు, సూర్యకాంతి తదితర నూతన వంగడాలను విడుదల చేశారు.
వైవిధ్య పశు సంపద
దేశీరకం నాటు పొట్టేళ్లు, గొర్రెలు, హళ్లికారు పొట్టి ఎద్దులు, పుంగనూరు, మలెనాడు గిత్తలు, గుజరాత్ ఆవులు తదితర 20 కిపైగా జాతులకు చెందిన ఆవులు, ఎద్దులు అలరిస్తాయి. ఇటీవల యువత వ్యవసాయం వైపు వస్తుండడంతో వారికి మరింత సహకారం అందించడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ వ్యవసాయ పరికరాలు ఆకర్షణగా నిలిచాయి. పలు వ్యవసాయ కాలేజీల విద్యార్థులు, రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పొద్దుతిరుగుడు పొలం వద్ద యువత సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కాగా మేళాకు మెజస్టిక్, కేఆర్ మార్కెట్, శివాజీనగర, యలహంక తదితర ప్రాంతాలనుంచి బీఎంటీసీ బస్ సేవలు కల్పించారు. జీకేవీకే గేట్ వద్ద నుంచి మేళా వరకు ఉచిత వాహన వసతి ఉంది. 16వ తేదీ సాయంత్రం వరకూ మేళా జరుగుతుంది.
బెంగళూరు వ్యవసాయ వర్సిటీలో
రైతు మేళా
ఆకట్టుకునే నూతన ఆవిష్కరణలు
సేద్యం.. సుసాధ్యం
సేద్యం.. సుసాధ్యం
సేద్యం.. సుసాధ్యం
సేద్యం.. సుసాధ్యం
సేద్యం.. సుసాధ్యం


