సాంఘిక సంక్షేమ శాఖలో ఎఫ్‌డీఏదే హవా
రాయచూరు రూరల్: సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఎఫ్‌డీఏగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశానికి ముడుపులకు శ్రీకారం చుట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. రాయచూరు తాలూకా వెనుక బడిన వర్గాల, సాంఘీక సంక్షేమ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ విద్యార్థుల ప్రవేశ ప్రక్రియల్లో అంతా తానై వ్యవహారాలు నడుపుతున్నారు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా ప్రక్రియ జరపకుండా డబ్బులిచ్చిన వారికి ప్రవేశాలు కల్పిస్తున్నా అధికారులు మౌనం వహించారు. వంట చేసే కుక్‌ల వద్ద నుంచి, వారికి జీతాలివ్వడానికి కూడా లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


