ఓబవ్వ ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం
బళ్లారి రూరల్ : వీరవనిత ఒనకె ఓబవ్వ ధైర్యం, శౌర్యం, త్యాగం, సాహసం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే బసవంతప్ప తెలిపారు. మంగళవారం జిల్లా యంత్రాంగం, కన్నడ సంస్కృతి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దావణగెరె జిల్లాధికారి సభామందిరంలో ఏర్పాటు చేసిన ఒనకె ఓబవ్వ జయంతిలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒనకె ఓబవ్వ అనుసరించిన మార్గం ప్రతిఒక్కరికీ అనుసరణీయమన్నారు. అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన మహిళ అయినా తనదైన సేవామనోభావంతో శౌర్యం, ధైర్యాన్ని ప్రదర్శించిందన్నారు. జిల్లాధికారి గంగాధరస్వామి మాట్లాడుతూ నిస్వార్థంగా సేవ చేసిన రాణి చెన్నమ్మ, ఒనకె ఓబవ్వ, బుద్ధ, బసవ, అంబేడ్కర్‌లను గుర్తుకు తెస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా ఓబవ్వ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. దుడా అధ్యక్షుడు దినేశ్‌శెట్టి, ప్రముఖులు మహంతేశ్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లల్లో శ్వాసకోశ
వ్యాధులు అరికట్టాలి
రాయచూరు రూరల్ : సభ్య సమాజంలో పిల్లల్లో శ్వాసకోశ ఇబ్బందులు రాకుండా నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ సురేంద్రబాబు పిలుపు ఇచ్చారు. బుధవారం నగరంలోని తల్లీబిడ్డల ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రపంచ న్యూమోనియా దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. శ్వాసకోశ వ్యాధుల బారిన పడిన ఐదేళ్ల లోపు పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రపంచంలో శ్వాసకోశ వ్యాధి సోకిన తక్షణమే చికిత్స చేయించుకోవాలన్నారు. వాయు కాలుష్యం, ధూమ పానం, మురికి వాడ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వ్యాధికి గురి అవుతున్నారని ఆయన వివరించారు. శ్వాసకోశ సంబంధిత దగ్గు, గుండె నొప్పి, నిశ్శక్తి, జలుబు, ఇతరత్ర వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. సమావేశంలో ఆర్‌సీహెచ్ అధికారి నందిత,వైద్యాదికారులు శాలిని, భువనేశ్వరి, ఇమ్రాన్, దాసప్ప, బసయ్య, గురు ప్రసాద్, సంధ్య, సరోజ, సిద్దమ్మ, అరుణ్‌లున్నారు.
ఆరోగ్య సేవల లబ్ధి పొందండి
రాయచూరు రూరల్ : గ్రామీణ ప్రజలు ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ పిలుపునిచ్చారు. బుధవారం మస్కి తాలూకా తుర్విహాళ సముదాయ ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మూత్ర పిండాల సమస్యలతో బాధపడేవారు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, ఆర్‌సీహెచ్ అధికారిణి నందిత, అయ్యనగౌడ, నాగరాజ్, జీవనజ్యోతి, కోనిక, దీపిక, విరుపాక్షప్పలున్నారు.
దేశానికి ఆదర్శం
కర్ణాటక కేఎస్‌ఆర్టీసీ
రాయచూరు రూరల్ : రవాణా రంగంలో కర్ణాటకకు చెందిన కేఎస్‌ఆర్‌టీసీ సంస్థ దేశానికి ఆదర్శ రాష్ట్రమని కేకేఆర్టీసీ మండలి అధ్యక్షుడు అరుణ్ కుమార్ పాటిల్ వెల్లడించారు. బుధవారం నగరంలోని కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్, డిపో, ఇతర విభాగాలను తనిఖీ చేసిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విద్యార్థులకు అనుకూలంగా రవాణా సౌకర్యాల కల్పనకు అధికారులు సహకరించాలన్నారు. ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా వాటికి తక్షణమే పరిష్కారం కనుగొనాలని సూచించారు. ఆయన వెంట డీసీ చంద్ర శేఖర్, విద్యా సాగర్, విజయ కుమార్‌లున్నారు.
రోడ్ల మరమ్మతు పనుల పరిశీలన
రాయచూరు రూరల్ : నగరంలో గుంతలు పడ్డ రహదారుల మరమ్మతు పనులకు నగరసభ అధికారులు శ్రీకారం చుట్టారు. బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేసిన తారు రోడ్లను పరిశీలించిన కమిషనర్ జుబిన్ మహాపాత్రో మాట్లాడారు. గుంతలు పడ్డ రహదారుల మరమ్మతుల విషయంలో 8 బృందాలను ఏర్పాటు చేసి అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజా పనుల శాఖకు అప్పగించిన గుంతలు పడ్డ రహదారుల మరమ్మతు పనులకు కోటి రూపాయలు వ్యయం చేస్తారన్నారు.
ఓబవ్వ ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం
ఓబవ్వ ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం
ఓబవ్వ ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం


