రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 14 నుంచి 72వ అఖిల భారత సహకార సప్తాహ–2025 ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాయచూరు జిల్లా కేంద్ర సహకార (ఆర్‌డీసీసీ) బ్యాంక్ అధ్యక్షుడు విశ్వనాథ్ పాటిల్ తోరణదిన్ని పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌డీసీసీ బ్యాంక్, ఇతర సహకార సంఘాల ఆధ్వర్యంలో రాయచూరులో వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఈనెల 15న జరిగే త్రిభువన్ సహకార పరిశోధన, శిక్షణ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య బెంగళూరు నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. సహకార రంగంలో వివిధ సేవలు అందించిన సహకార నేతలకు సహకార రత్న అవార్డులను అందజేస్తారన్నారు. తిమ్మయ్య శెట్టి, విజయ్ కుమార్, కల్లయ్య, బసవరాజ్, మనోహర్‌లున్నారు.
విద్యా, సామాజిక
రంగాల్లో రాణించాలి
రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు విద్యా, సామాజిక రంగంలో రాణించాలని మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా కలబుర్గి గంగసిరి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిలో ఆయన మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతలను గురించి తెలుసుకోవాలన్నారు. వేగంగా పెరుగుతున్న విద్యా రంగంలో పాఠ్యాంశాల్లో మార్పులను చేయాలన్నారు. కళాశాల పిన్సిపాల్ రాజేంద్ర, కొండా ప్రేమ్‌చంద్, ఉమా, కవిత, మహేష్ గంగ్వార్, సుష్మా, జ్యోతి, స్మిత, శేతులున్నారు.
కార్తీక దీపం.. శోభాయమానం
రాయచూరు రూరల్: నగరంలోని దేవీనగర్‌లోని వీరభద్రేశ్వరాలయం, పంచలింగేశ్వర ఆలయం, గణేష్ ఆలయం, బిల్వ మందిరంలో మంగళవారం రాత్రి కార్తీక దీపోత్సవం చేపట్టారు. సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో దీపాలను వెలిగించడం మన సంప్రదాయం అన్నారు. అనంతరం మహిళలు ఓంకారం, స్వస్తిక్, శివలింగాకారాల్లో కార్తీక దీపాలను వెలిగించారు.
కసాప జిల్లాధ్యక్షుడు రాజీనామా చేయాలి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్ రాజీనామా చేయాలని బెళకు సంస్థ అధ్యక్షుడు అణ్ణప్ప మేటిగౌడ డిమాండ్ చేశారు. బుధవారం కన్నడ భవనం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్ల నుంచి జిల్లాలో సాహిత్య పరిషత్ కార్యక్రమాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. అనారోగ్యంతో సాిహిత్య పరిషత్ సేవలు చేయడానికి వీలు కానప్పుడు రాజీనామా చేసి ఇతరులకు అధికార బాధ్యతలు అప్పగించాలన్నారు. రాష్ట్ర కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుల అనుమతి లేకుండా ఏడు తాలూకాల అధ్యక్షులను మార్పు చేసి నూతన అధ్యక్షులను నియమించారన్నారు.
జకరవే అధ్యక్షురాలిగా అమృత
రాయచూరు రూరల్ : జయ కర్ణాటక రక్షణ వేదిక మహిళా విభాగం జిల్లాధ్యక్షురాలిగా అమృతను నియమిస్తూ జయ కర్ణాటక రక్షణ వేదిక జిల్లాధ్యక్షుడు శ్యాం సుందర్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నగరంలోని జయ కర్ణాటక రక్షణ వేదిక కార్యాలయంలో ఆదేశ ప్రతిని అందించి మాట్లాడారు. ప్రజా స్నేహ సంస్థగా పేరు సాధించిన జయ కర్ణాటక రక్షణ వేదిక కన్నడ భాష, నేల, నీరు, భాషపై పోరాటానికి ఎల్లప్పుడూ సిద్ధమని తెలిపారు.
14 నుంచి సహకార సప్తాహ ఉత్సవాలు
14 నుంచి సహకార సప్తాహ ఉత్సవాలు
14 నుంచి సహకార సప్తాహ ఉత్సవాలు
14 నుంచి సహకార సప్తాహ ఉత్సవాలు


