రఘునందన తీర్థుల మధ్యారాధన
హొసపేటె: రఘునందన తీర్థుల మధ్యారాధన అత్యంత పవిత్రమైన రోజు. మఠం శిష్యులకు, భక్తులకు అర్థవంతమైన, పవిత్రమైన రోజు అని మంత్రాలయ రాఘవేంద్ర మఠం అధిపతి 1008 సుబుదేంద్ర తీర్థ స్వామీజీ అన్నారు. బుధవారం హంపీలో రఘునందన తీర్థులకు మూల రామచంద్ర దేవర సంస్థాన పూజను హంపీలోని రఘునందన తీర్థ మఠం మూల బృందావన సన్నిధిలో నిర్వహించి ఆశీర్వాద సందేశాన్ని ఇచ్చారు. యతులు, హరిదాసులు అత్యంత పవిత్రమైన భూమి హంపీలో తిరుగుతున్నారని ఆయన అన్నారు. మూలరామదేవుని సంస్థాన పూజలు నిర్వహించి తరలి వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. అనంతరం నైవేద్యం, హస్తోదకం, మహామంగళారతి నిర్వహించారు. మంత్రాలయ గురుసార్వభౌమ దాస్ సాహిత్య ప్రాజెక్టు రాష్ట్ర కోఆర్డినేటర్ సులాది హనుమేశాచార్య దాస సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మఠం పండితులు శామాచార్య, ద్వారకానాథ్ ఆచార్య, వేణుగోపాల్ ఆచార్య, శ్రీవారి సన్నిహితుడు ప్రకాష్, మఠం నిర్వాహకులు భీమసేనాచార్యులు, పవనాచార్య, విచారణకర్త గురురాజ్ దిగ్గావి, నిర్వాహకులు సుమంత్ కులకర్ణి, టీకాచార్య, ప్రముఖులు హత్తిబెళగల్ గురురాజ్, జిల్లా ప్రాజెక్టు సదహేంద్ర ఆచార్య, కోఆర్టినేటర్ అనంత పద్మనాభం, రాష్ట్ర, దేశ, విదేశాల నుంచి వచ్చిన శిష్యులు, భక్తులు పాల్గొన్నారు.
రఘునందన తీర్థుల మధ్యారాధన


