30న జాతీయ స్థాయి కరాటే పోటీలు | - | Sakshi
Sakshi News home page

30న జాతీయ స్థాయి కరాటే పోటీలు

Nov 13 2025 7:52 AM | Updated on Nov 13 2025 7:52 AM

30న జాతీయ స్థాయి కరాటే పోటీలు

30న జాతీయ స్థాయి కరాటే పోటీలు

బళ్లారిటౌన్‌: ట్రెడిషనల్‌ షోటోఖాన్‌ కరాటే అకాడమి, కర్ణాటక వరల్డ్‌ ట్రెడిషనల్‌ షోటోఖాన్‌ కరాటే ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 30న నగరంలోని కువెంపు నగరలోని కిమ్స్‌ ప్యాలెస్‌లో 3వ జాతీయ స్థాయి కరాటే పోటీలను నిర్వహిస్తున్నట్లు కరాటే అకాడమి సంస్థాపకుడు కట్టెస్వామి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా కరాటే క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటికే 15 రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలియజేశారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా వసతి, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వివిధ దశల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా అఖిల కర్ణాటక స్పోర్స్‌ కరాటే అసోసియేషన్‌ అధ్యక్షుడు అరుణ్‌ మాచయ్య, రాష్ట్ర కరాటే ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మహమ్మద్‌ నబీన్‌ పాల్గొంటారని తెలిపారు. కరాటే ఉపాధ్యాయులు సురేష్‌, రవికుమార్‌, జడేశ్‌, హులిగేశ్‌, ప్రసాద్‌, రామకృష్ణ, లక్ష్మీ, హరిప్రశాంత్‌, దినేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement