అణువణువూ చెకింగ్
బనశంకరి: దేశ రాజధాని ఢిల్లీలో కారు బాంబు పేలుడు నేపథ్యంలో సిలికాన్ సిటీతో పాటు రాష్ట్రంలో ముఖ్య ప్రాంతాల్లో భద్రతను పెంచారు. బెంగళూరు నగరంలో సమస్యాత్మక ప్రదేశాలు, జన రద్దీ ప్రాంతాలు, కెంపేగౌడ విమానాశ్రయంలో హై అలర్ట్‌ను ప్రకటించారు. విమానాశ్రయానికి వచ్చి వెళ్లే వాహనాలు వెళ్లేవాహనాలపై నిఘాపెట్టారు. విమానాశ్రయ భద్రతకు అదనంగా పోటీసుల బలగాలను నియమించారు. లోపల బయట గస్తీని పెంచారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు, సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
జాగిలాలతో.
రాజధానిలో రద్దీ ప్రదేశాలైన మెజస్టిక్ బస్టాండు, రైల్వేస్టేషన్, మెట్రో రైలు స్టేషన్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. రైల్వేస్టేషన్లలో పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలతో రైళ్ల లోపల, బయట ప్రయాణికులను పరిశీలించారు. మెజస్టిక్ చుట్టుపక్కల కేఎస్‌ఆర్‌పీ పోలీసులు నియమించారు. బస్సుల్లో ప్రయాణికులను, లగేజీని చెక్ చేశారు. విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికుల బ్యాగులను కూడా శునకాలతో గాలించారు. అలాగే రైలు బోగీల లోపల కూడా గాలించారు. దీంతో ఏం జరుగుతోందోనని ప్రయాణికులు హడలిపోయారు.
భద్రత పెంపు: డీజీపీ
బెంగళూరులో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘాపెట్టాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో భద్రతను పెంచాలని డీజీపీ ఎంఏ.సలీం ఆదేశించారు. ప్రజల సురక్షతకు ప్రాదాన్యత ఇవ్వాలని హోంశాఖ సూచించింది. పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని సీఎం సిద్దరామయ్య మనవి చేశారు.
ఇతర నగరాలలో
మైసూరులో బస్టాండు, రైల్వేస్టేషను, విమానాశ్రయం, ప్రముఖ ప్రాంతాలలో పోలీసులు గాలింపు చేపట్టారు. మంగళూరు, ఉడుపి, కార్వార వంటి సముద్ర తీర ప్రాంతాలలో అలర్ట్ పెరిగింది.
బెంగళూరులో విమానాశ్రయం,
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో తనిఖీలు
ఢిల్లీ బాంబు పేలుడు ఎఫెక్టు..
అణువణువూ చెకింగ్
అణువణువూ చెకింగ్
అణువణువూ చెకింగ్
అణువణువూ చెకింగ్
అణువణువూ చెకింగ్


