పాత్రికేయుల సదస్సుకు సజ్జలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పాత్రికేయుల సదస్సుకు సజ్జలకు ఆహ్వానం

Nov 12 2025 6:53 AM | Updated on Nov 12 2025 6:53 AM

పాత్ర

పాత్రికేయుల సదస్సుకు సజ్జలకు ఆహ్వానం

బొమ్మనహళ్లి: డిసెంబర్‌ 6వ తేదీన బెంగళూరులోని మాల్‌ ఆఫ్‌ ఆసియా ఆడిటోరియంలో జరిగే సౌత్‌ ఇండియా మీడియా అసోసియేషన్‌ (ఎస్‌ఐఓ) ఆధ్వర్యంలో నిర్వహించే సౌత్‌ ఇండియా మీడియా సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం సైమా జనరల్‌ సెక్రటరీ నకిరెకంటి స్వామి, బెంగళూరు ప్రెస్‌క్లబ్‌ జనరల్‌ సెక్రటరీ శివకుమార్‌ బెళ్ళితట్టె, ఆంధ్రప్రదేశ్‌ సైమా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, సీనియర్‌ జర్నలిస్టులు ఎస్‌ఎస్‌ గురునాథ్‌, ఎం.ఎస్‌.ఎస్‌.బాషా, సత్యానంద్‌ తదితరులు తాడేపల్లిలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి ఆ హ్వానం అందజేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో ఐదు రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులను ఒకచోటకు చేర్చి సమావేశం జరపడం చాలా సంతోషకరమని తెలిపారు.

తగ్గిన బాలింతల

మరణాలు: మంత్రి

శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రసవ సమయంలో ఈ ఏడాదిలో బాలింతల మరణాలు 24 శాతం తగ్గినట్లు ఆరోగ్య మంత్రి దినేశ్‌ గుండురావు చెప్పారు. వికాససౌధలో విలేకరులతో మాట్లాడిన ఆయన, గత 2024 జనవరి నెల నుంచి అక్టోబర్‌ వరకు మొత్తం 483 మంది తల్లుల మరణాల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నంచి అక్టోబర్‌ వరకు 366 మరణాలు సంభవించాయి, దీంతో 24 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపారు. అధిక ప్రసవాలు జరిగే ఆస్పత్రుల్లో ఎక్కువమంది వైద్య సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. మునుముందు తాలూకా ఆసుపత్రుల్లో ఇద్దరు చొప్పున సీ్త్రరోగ నిపుణులు, పిల్లల నిపుణులు, ఆపరేషన్‌ నిపుణులను నియమిస్తామన్నారు.

కాలువలో పడి

ముగ్గురు గల్లంతు

సాక్షి బళ్లారి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటి కాలువలోకి కాలు జారి పడి గల్లంతైన ఘటన మంగళవారం విజయపుర జిల్లా ముద్దెబిహాళ్‌ తాలూకా శిరోళ గ్రామంలో జరిగింది. బసమ్మ కన్నూరు (21), సంతోష్‌ కన్నూరు (16), రవి కన్నూరు (15) అనే ముగ్గురు గ్రామ శివారులో ప్రవహిస్తున్న కేబీఎన్‌ ఎడమ కాలువ వద్దకు వెళ్లారు. అయితే కాలువలోకి పడడంతో కొట్టుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని గాలింపు చేపట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కాలువ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

మద్యం అంగడిపై మహిళల దాడి

దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ తాలూకా కల్లహళ్లి గ్రామంలో బెల్ట్‌ షాపుపై గ్రామస్తులు దాడి చేసి మద్యం సీసాలను పగులగొట్టారు. గ్రామంలోని ఒక అంగడిలో అక్రమంగా పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం అమ్ముతున్నారు. మగవాళ్లు మద్యం తాగుతూ పనులకు వెళ్లకుండా పడిపోతున్నారని, వీరివల్ల పిల్లలు కూడా పాడవుతున్నారని మహిళలు మండిపడ్డారు. సదరు బెల్టు షాపుపై దాడి చేసి లోపల ఉన్న మద్యం బాటిళ్లను విసిరేసి రచ్చ చేశారు. మరోసారి మద్యం అమ్మితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఎకై ్సజ్‌ సిబ్బంది పరోక్షంగా ఇలాంటి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

ఆఫ్రికన్‌ అరెస్టు,

రూ.1.7 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌

బనశంకరి: బెంగళూరు లో డ్రగ్స్‌ విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పౌరుని ఇంటిపై మంగళవారం ఆవలహళ్లి పోలీసులు దాడిచేశారు. ఇతడి వద్ద నుంచి రూ.1.7 కోట్ల విలువచేసే 537 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికాలోని లైబీరియా దేశానికి చెందిన కౌండెహ్‌ప్రిన్స్‌ ఇంజనీరింగ్‌ చదివి ఖాళీగా ఉంటున్నాడు. తన అద్దె ఇంట్లో ఎండీఎంఏ క్రిస్టల్‌ డ్రగ్స్‌ను ఉంచుకుని అమ్ముతూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడు, బడా డ్రగ్‌ పెడ్లర్ల నుంచి తక్కువ ధరతో కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్మేవాడు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

ఘటన జరిగిన కాలువ

పాత్రికేయుల సదస్సుకు  సజ్జలకు ఆహ్వానం  1
1/1

పాత్రికేయుల సదస్సుకు సజ్జలకు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement