పులి సంచారం.. భయం గుప్పిట్లో జనం | - | Sakshi
Sakshi News home page

పులి సంచారం.. భయం గుప్పిట్లో జనం

Nov 11 2025 5:49 AM | Updated on Nov 11 2025 5:51 AM

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతంలోని మల్లాపూర్‌లో పులి సంచరించడంతో ప్రజలు భయం గుప్పిట్లో వణుకుతున్నారు. ఆదివారం రాత్రి పులి సంచరించినట్లు తెలియడంతో రాయచూరు తాలూకా మల్లాపూర్‌లో గ్రామ ప్రజలు భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. విషయం తెలియగానే యరగేర సీఐ నింగయ్య, అటవీ శాఖ అధికారులు కలిసి గ్రామాన్ని సందర్శించి ప్రజల గోడు ఆలకించి అండగా నిలుస్తామని ధైర్యం చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.

వ్యక్తి అదృశ్యం

హొసపేటె: నగరంలోని చిత్తవాడ్గి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హౌస్‌ గార్డుగా పని చేస్తున్న టి.మంజునాథ్‌ అనే 48 ఏళ్ల వ్యక్తి అదృశ్యం కావడంపై చిత్తవాడ్గి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తప్పిపోయిన వ్యక్తి సుమారు 5.3 అడుగుల ఎత్తు పొడవు, బలమైన శరీరాకృతి, గోధుమ రంగు శరీరఛాయ కలిగి ఉన్నాడు. ఖాకీ యూనిఫాం ధరించాడని, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడగలడని, ఇతని ఆచూకీ తెలిస్తే 9480803756 లేదా చిత్తవాడ్గి పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని ఆ పోలీస్‌ స్టేషన్‌ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.

లబ్ధిదారులకు ఆహార

కిట్ల పంపిణీ

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలూకా జాగీర్‌ వెంకటాపూర్‌లోని చౌక ధరల దుకాణంలో అన్న సువిధ పథకం కింద 75 ఏళ్లు పైబడిన వయో వృద్ధులైన లబ్ధిదారులకు ఆహార పదార్థాల కిట్లను ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి నాసీర్‌ అహ్మద్‌ సోమవారం పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఏక కుటుంబ సభ్యులున్న వారికి ఈ పథకం అమలు చేస్తున్నారు. కార్యక్రమంలో అమరేష్‌, సిద్ద లింగయ్య శివంగి, శాంత మూర్తి, బాబు, శేఖరప్ప, మహబూబ్‌లున్నారు.

టిప్పుసుల్తాన్‌ జయంతి

రాయచూరు రూరల్‌: నగరంలో టిప్పుసుల్తాన్‌ 231వ జయంతిని సరళంగా నిర్వహించారు. సోమవారం టిప్పుసుల్తాన్‌ సర్కిల్‌ వద్ద నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్‌ సమీర్‌, పరాజిత అభ్యర్థి శాలం నేతృత్వంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో టిప్పుసుల్తాన్‌ జయంతిని ఆచరించారు. టిప్పుసుల్తాన్‌ సంఘం సంచాలకుడు హైఫరోజ్‌, బషీరుద్దీన్‌, వక్ఫ్‌ బోర్డు మాజీ అధ్యక్షుడు ఫర్హాన్‌ మౌలా, మాసూమ్‌, నరసింహులు, కుమారస్వామి, విశ్వనాథ్‌ పట్టి పాల్గొన్నారు.

పచ్చదనం పెంపొందిద్దాం

రాయచూరు రూరల్‌: నగర ప్రాంతాల్లో పచ్చదనం వృద్ధికి పచ్చని చెట్ల పెంపకానికి ప్రాధాన్యత కల్పించి పర్యావరణాన్ని సంరక్షిద్దామని నగరసభ సభ్యులు జయన్న, నాగరాజ్‌ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కృష్ణదేవరాయ కాలనీలో హసిరు సంభ్రమలో భాగంగా ఉద్యానవనంలో మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్యత్తులో ఆరోగ్య రక్షణకు ఉత్తమ పరిసరాల సంరక్షణ దోహదపడుతుందన్నారు. ప్రతి ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో లావణ్య, గోవిందు, గురుస్వామి, వినోద్‌, శరణబసవ, మనోహర్‌, వెంకటేష్‌లున్నారు.

ఇద్దరు బైక్‌ దొంగల అరెస్టు

కేజీఎఫ్‌ : ఇద్దరు ద్విచక్రవాహన దొంగలను అరెస్టు చేసిన బేతమంగల పోలీసులు వారి వద్ద నుంచి రూ.2.7 లక్షల విలువ చేసే 5 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వేలూరు తాలూకాకు చెందిన కే.కుమార్‌(24), గుబేంద్రన్‌(20)లు పోలీసులు అరెస్టు చేసిన నిందితులు. నిందితులను అరెస్టు చేయడానికి డీఎస్పీ వీ.లక్ష్మయ్య మార్గదర్శనంలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌ వై ఆర్‌ రంగశామయ్య నేతృత్వంలో బృందాన్ని రచించారు. తనిఖీ చేపట్టిన పోలీసు బృందం వారి వద్ద నుంచి చోరీ చేసిన ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుంది.

పులి సంచారం..  భయం గుప్పిట్లో జనం 1
1/5

పులి సంచారం.. భయం గుప్పిట్లో జనం

పులి సంచారం..  భయం గుప్పిట్లో జనం 2
2/5

పులి సంచారం.. భయం గుప్పిట్లో జనం

పులి సంచారం..  భయం గుప్పిట్లో జనం 3
3/5

పులి సంచారం.. భయం గుప్పిట్లో జనం

పులి సంచారం..  భయం గుప్పిట్లో జనం 4
4/5

పులి సంచారం.. భయం గుప్పిట్లో జనం

పులి సంచారం..  భయం గుప్పిట్లో జనం 5
5/5

పులి సంచారం.. భయం గుప్పిట్లో జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement