రోడ్డు విస్తరణ కోసం కొట్లు ఖాళీ
బళ్లారి రూరల్ : నగరంలోని విద్యానగర్ కొళగల్లు రోడ్డులో బతుకుతెరువు కోసం రోడ్డు పక్కన కొట్టు పెట్టుకొన్నాము. రోడ్డు విస్తరణ అంటూ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు తక్షణమే ఖాళీ చేయిస్తున్నారని వీధి వ్యాపారులు వాపోయారు. వీధివ్యాపారులు విద్యానగర్‌లోని కొళగల్లు రోడ్డు ఓపీడీ కాంపౌండును ఆనుకొని కొన్నేళ్లుగా కొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే శనివారం రోడ్డు విస్తరణకు కొట్లు తీసేయాలని రోడ్డు కాంట్రాక్టర్ హెచ్చరించారు. దీంతో సోమవారం వీధి వ్యాపారులు తమంతట తాముగా తమ కొట్లను తొలగించారు. వీధివ్యాపారాలను నమ్ముకొని కుటుంబ పోషణ చేసుకుంటూ, పిల్లలకు చదువులు చెప్పించుకుంటూ, రోజువారీ చెల్లింపుతో ఫైనాన్స్ తీసుకొని జీవనం సాగిస్తున్నామని వ్యాపారులు బోరుమన్నారు. తమకు వేరే చోట వ్యాపారం చేసుకోవడానికి ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని వీధివ్యాపారులు కోరారు.
నోటీసులు ఇవ్వకుండా తక్షణం
ఖాళీ చేయాలని హుకుం
పొట్టకూటి కోసం కొట్టు పెట్టుకొంటే ఖాళీ చేయిస్తున్నారు
ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని వీధివ్యాపారుల వినతి


