నత్తనడకన వంతెన నిర్మాణ పనులు
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల మరమ్మతు పనుల పేరుతో కాంట్రాక్టర్లు నిధుల నిలువు దోపిడీకి పూనుకున్నారు. రాయచూరు తాలూకాలో వంతెన నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన కొట్టుకు పోయింది. ప్రజలు సంచరించే ఈ వంతెన నిర్మాణ పనులను గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాల్సి ఉంది. జిల్లా ఇంచార్జి మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుని అధికారులకు హుకుం జారీ చేయాలి. నెలరోజుల క్రితం రాయచూరు తాలూకా పత్తేపూర్ పరిసరాలలో కురిసిన భారీ వర్షాలకు వంతెన కొట్టుకు పోయింది. గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ నేటికీ ఆ గ్రామాల వైపు వెళ్లకుండా, వంతెన బాగోగులను గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పత్తేపూర్, జాగీర్ వెంకటాపూర్, రఘునాథనహళ్లి, సుల్తాన్‌పూర్, అరళప్పన హుడా గ్రామాల ప్రజలకు రాకపోకలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైతులు పొలం పనులకు వెళ్లడానికి, వ్యవసాయ కూలీలు కూలీ పనులు లేక తల్లడిల్లిపోతున్నారు. విద్యార్థులు విద్యాభ్యాసం కోసం రాయచూరుకు వెళ్లడానికి కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాలకు కొట్టుకు పోయిన
పత్తేపూర్ వంతెన
స్తంభించిన ఐదు గ్రామాల
ప్రజల రాకపోకలు
నత్తనడకన వంతెన నిర్మాణ పనులు


