పాత్రికేయ సంఘాల కార్యవర్గం ఎన్నిక
రాయచూరు రూరల్: రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా శాఖకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. పాత్రికేయుల భవనంలో ఎన్నికల అధికారి మల్లన్న ఎన్నికలను శాంతియుతంగా జరిపించారు. రాత్రి 10 గంటల తర్వాత ఫలితాలు ప్రకటించారు. జిల్లాధ్యక్ష స్థానానికి గురునాథ్, సత్యనారాయణ పోటీ పడ్డారు. జిల్లాధ్యక్షుడిగా గురునాథ్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సిద్దయ్య స్వామి, కోశాధికారిగా మల్లికార్జునయ్య, ఉపాధ్యక్షులుగా సూగూరేశ్వర గుడి, మహానంద, అశోక్, అమరేష్, శరణ బసవ, కార్యదర్శులుగా బసవరాజ్, శరణయ్య, రాఘవేంద్ర గుమాస్తే, సభ్యులుగా లక్ష్మణ్, ముత్తన్న, చంద్రశేఖర్, బలభీమరావ్, తాయప్ప, అమరేష్, ముస్తాఫా, ఉదయ్, ప్రకాష్ మస్కి, సిద్దనగౌడ, ప్రసన్న కుమార్ జైన్, హన్మంత నాయక్, గుండప్ప, నీలకంఠ స్వామిలు గెలిచినట్లు అధికారులు తెలిపారు.
విజయనగరలో...
హొసపేటె: కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ విజయనగర జిల్లా శాఖకు 2025–28వ సంవత్సరాల మధ్య అవధికి ప్రెస్ క్లబ్‌లో ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. డీ.రుద్రప్ప, సీకే.నాగరాజ, టీబీ రాజా ఎన్నికకాగా మిగిలిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సమాచార, పౌర సంబంధాల శాఖ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్, ఎన్నికల అధికారిగా వ్యవహరించిన బీ.ధనుంజయప్ప తెలిపారు. పీ.సత్యనారాయణ(అధ్యక్షుడు), కే.లక్ష్మణ్ (ప్రధాన కార్యదర్శి) పీ.వెంకోబ నాయక్ (రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు), కే.సురేష్ చవాన్, ఎం.రవికుమార్ (కార్యదర్శులు), జిల్లా కార్యనిర్వాహక సభ్యులుగా సీ.శివానంద, భీమరాజ్, యూ.అనంత పద్మనాభ రావు, బీ.కుమారస్వామి, సంజయ్‌కుమార్, ఎంబీ వీరేశ్వర్, వీరేష్ అంగడి, పీ.శ్రీనివాసులు, ఇందిరా కలాల్, వీరేంద్ర నాగలదిన్ని, రామ్ ప్రసాద్ గాంధీ, హెచ్.వెంకటేష్, కేబీ.ఖవాస్, అనంత్‌జోషి, ఎస్‌ఎం.బసవరాజ్ ఎన్నికయ్యారు.
పాత్రికేయ సంఘాల కార్యవర్గం ఎన్నిక


