బ్యాటరీ స్కూటర్ దగ్ధం
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని క్యారకట్టి గ్రామ సమీపంలో శనివారం ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో చిక్కుకుంది. హరపనహళ్లి నుంచి దావణగెరెకు వస్తుండగా ఉన్నట్టుండి మంటలు అంటుకుని పూర్తిగా కాలి పోయింది. మొదట పొగ, మంటలు రావడాన్ని గమనించిన వాహనదారు వెంటనే కిందకు దిగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. క్షణాల్లోనే పెద్దఎత్తున మంటలు చెలరేగి క్షణాల్లో కాలిపోయింది. హరపనహళ్లి తాలూకాలోని చిక్కిహళ్లి గ్రామానికి చెందిన శివకుమార్ బాధితుడు, అతడు మాట్లాడుతూ ఈ స్కూటర్‌ను దావణగెరెలోని హదడి రోడ్డులోని ఓలా షోరూమ్‌లో కొనుగోలు చేశానని, కాలిపోయినట్లు షోరూమ్ సిబ్బందికి కాల్ చేయగా, అస్సలు పట్టించుకోలేదని వాపోయాడు.
మృతుల కుటుంబాలకు
పరిహారం పంపిణీ
రాయచూరు రూరల్: గంగావతి వద్ద జరుగుతున్న వర్థంతి ఉత్సవాలకు వెళుతూ రాయచూరు జిల్లా ిసింధనూరు వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పరిహారం పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం మంత్రాలయ మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ నాలుగు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారధనం చెక్‌ను అందించారు. సంస్కృత వేద పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులకు మఠంలో ఉద్యోగాలు కల్పిస్తామని సుబుదేంద్ర తీర్థ స్వామీజీ తెలిపారు.
బ్యాటరీ స్కూటర్ దగ్ధం


