కన్నడ భాషను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

కన్నడ భాషను ప్రోత్సహించాలి

Nov 4 2025 7:20 AM | Updated on Nov 4 2025 7:20 AM

కన్నడ

కన్నడ భాషను ప్రోత్సహించాలి

రాయచూరు రూరల్‌ : పట్టణ ప్రాంతాల్లో కన్నడ భాషకు ప్రోత్సాహమివ్వాలని అఖిల కర్ణాటక మహిళా శిశు క్షేమాభివృద్ధి సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి పిలుపు ఇచ్చారు. కన్నడ భవవనంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. నేటికీ పట్టణ, నగర ప్రాంతాల్లో కన్నడలో వ్యాఖ్యానించడం, మాట్లాడటంలో వెనుకంజ వేస్తున్నారన్నారు. అందువల్ల కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

అంగరంగ వైభవంగా

మహానందీశ్వర రథోత్సవం

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలూకా జాగీర్‌ వెంకటాపూర్‌లో మహా నందీశ్వర రథోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి వందలాది మంది భక్తుల సమక్షంలో నూతన రథోత్సవం నిర్వహించారు. మహానందీశ్వరకు ప్రత్యేక పూజలను కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, రాయచూరు శాసన సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌ నెరవేర్చారు. రథోత్సవంలో రాయచూరు, మాన్వి, సింధనూరు తాలూకాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విద్యార్థిపై బీర్‌ బాటిల్‌తో దాడి

పావగడ: మద్యం తాగరాదని సూచించిన 9వ తరగతి విద్యార్థిపై పదో తరగతి విద్యార్థి బీర్‌ బాటిల్‌తో దాడి చేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. వివరాలు.. పావగడలోని హాఫ్‌ బండపై ఉన్న బాపూజీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆదివారం సాయంత్రం బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతుండగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థి గుర్తించి, వారించే ప్రయత్నం చేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పదో తరగతి విద్యార్థి... తనకే చెబుతావా? అంటూ ఖాళీ బీర్‌బాటిల్‌ సీసాతో 9వ తరగతి విద్యార్థిపై దాడి చేశాడు. ఘటనలో చెవి, వీపుపై లోతైన గాయాలయ్యాయి. దాడిని అడ్డుకోబోయిన అక్షర దాసోహ ఉద్యోగి లక్ష్మీదేవిని దుర్భాషలాడుతూ పదో తరగతి విద్యార్థి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న 9వ తరగతి విద్యార్థిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీపుపై 12 కుట్లు పడ్డాయి. ఘటనపై బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఏటా రాజ్యోత్సవాన్ని

నిర్వహించాలని డిమాండ్‌

బళ్లారిఅర్బన్‌: ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ సాంకేతిక పాఠశాల(జేటీఎస్‌)లో రాజ్యోత్సవ వేడుకలను ఏటా నిర్వహించాలని కర్ణాటక రక్షణ వేదిక ప్రవీణ్‌ శెట్టి వర్గం జిల్లా అధ్యక్షుడు వీహెచ్‌ హులుగప్ప, రాష్ట్ర కన్వినర్‌ అద్దిగేరి రామన్న నేతృత్వంలోని బృందం పాఠశాలకు వెళ్లి సదరు ప్రిన్సిపాల్‌ను డిమాండ్‌ చేసింది. రాజ్యోత్సవ వేడుకకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ జగదీశ్‌ పాఠశాలకు సెలవు ప్రకటించి జెండా ఎగరవేసి భువనేశ్వరి మాత చిత్రపటానికి పూజలు చేసి రాజ్యోత్సవ నిర్వహణ ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇకపై ప్రతి ఏటా వేడుకలను తప్పకుండా చేపట్టి జెండా ఎగరవేసి ఇతర కార్యక్రమాలను నిర్వహించి రాజ్యోత్సవ కార్యక్రమాన్ని సార్థకమయం చేయాలని సూచించారు. ప్రముఖులు ఆనంద్‌, వెంకటేష్‌, నబీ సాబ్‌, హనుమంతు, హనుమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి హ్యామర్‌

త్రో పోటీలకు ఎంపిక

రాయచూరు రూరల్‌: జిల్లా స్థాయిలో జరిగిన హ్యామర్‌ త్రో పోటీల్లో కలబుర్గికి చెందిన ఆశా భూతాళి ప్రథమ స్థానం సాధించింది. కలబుర్గిలోని హైదరాబాద్‌ కర్ణాటక ఎడ్యుకేషన్‌ సొసైటీ బాలికల కళాశాల విద్యార్థిని అయిన ఆశా భూతాళి కలబు ర్గిలో జరిగిన డివిజన్‌ స్థాయి పోటీల్లో ప్రథఽమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఆమె ఈ నెలాఖరులో బెంగళూరులో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాను కరువు పీడిత

ప్రాంతంగా ప్రకటించండి

రాయచూరు రూరల్‌: అతివృష్టి, అనావృష్టితో తల్లడిల్లిన రాయచూరు జిల్లాను కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని అఖిల భారత రైతు వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు మల్లికార్జునగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన వరి, కంది, పత్తి పంటలు విపరీతమైన వర్షాలకు నాశనం కావడంతో పరిహారం అందించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

కన్నడ భాషను ప్రోత్సహించాలి 1
1/3

కన్నడ భాషను ప్రోత్సహించాలి

కన్నడ భాషను ప్రోత్సహించాలి 2
2/3

కన్నడ భాషను ప్రోత్సహించాలి

కన్నడ భాషను ప్రోత్సహించాలి 3
3/3

కన్నడ భాషను ప్రోత్సహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement