మహిమాన్వితుడు.. అన్నమయ్య తాత | - | Sakshi
Sakshi News home page

మహిమాన్వితుడు.. అన్నమయ్య తాత

Nov 4 2025 7:20 AM | Updated on Nov 4 2025 7:20 AM

మహిమా

మహిమాన్వితుడు.. అన్నమయ్య తాత

రాయచూరు రూరల్‌ : భక్తుల పాలిట కొంగు బంగారంలా అందరి మన్ననలను పొందిన మహానుభావుడు కొండారెడ్డి తన మహిమలతో అన్నమయ్య తాతగా పేరొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోని పొనకలదిన్నెలో జన్మించిన కొండారెడ్డి కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి పట్టణానికి సమీపంలో భక్తులకు తన మహిమలు ప్రదర్శించారు. లక్ష్మిదేవమ్మ, లింగారెడ్డి దంపతులకు ఆరు మంది మగ సంతానంలో నాలుగవ సంతానంగా కొండారెడ్డి జన్మించారు. గ్రామంలో 5వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. గ్రామ వంతెనలో ఇసుకతో శివలింగాన్ని చేసి మౌనంగా ధ్యానం చేసేవారు. మూడు రోజుల పాటు కుండపోత వానలు కురిసి వాగు నిండి నీరు ఉప్పొంగి ప్రవహించాయి. అందులోనే ఉండి పోయారు. నీరు తగ్గుముఖం పట్టిన తరువాత కొండారెడ్డి యోగి మాదిరిగా పద్మాసనం వేసుకోని కూర్చోవడం ఆశ్చర్యం కలిగించింది.

తాత మహిమలు ఎన్నో.!

పొలంలో పనులు చేస్తున్న సమయంలో ఎద్దులు వాటంతటవే దున్నుతున్నట్లు ప్రతీతి. ప్రాథమిక పాఠశాలలో శివ తాండవం వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. వేదాంత పఠనంలో పరిణితి చెందారు. ఇంటి దేవుడు ఉరుకుంద ఈరణ్ణ కాగా ప్రసాద సమయంలో నేనే దేవుడంటూ ప్రసాదాన్ని స్వీకరించారు. అలాంటి దశ నుంచి దిగంబరుడిగా మారారు. ఒక రోజు వడగళ్ల వాన కురుస్తున్న సమయంలో బంగారు వానలు పడ్డాయి. అనంతరం కర్ణాటకలోని మాన్వికి ప్రయాణించారు. 1944లో ముస్టూరులో కొండపై నల్లబొగ్గుతో అంజనేయుడి చిత్రాన్ని ప్రాణ ప్రతిష్ట చేశారు. వాగులోని ఇసుకలో మొండెం వరకు ఉండిన కొండారెడ్డిని చూసి గ్రామస్తులు ఆయనను వెలికి తీయడానికొచ్చారు. అంతలోనే అన్నమయ్య అంటూ గాల్లోకి ఎగిరి దేవాలయంలోకి వెళ్లారు. అన్నమయ్య(కొండారెడ్డి) పురంధర దాసుల కీర్తనలలో లీనమయ్యేవాడు. మాన్వి వద్ద కొండపై తపస్సు చేశారు.

మాన్వి కొండపై మూడు రోజుల పాటు తాత ఉత్సవాలకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి కర్ణాటకలో మహిమలు ప్రదర్శించిన వైనం

తాత హస్తస్పర్శతో జింకలకు ప్రాణం

వేటగాళ్లు జింకలను చంపి బావి వద్ద నీరు తాగడానికి వచ్చారు. అన్నమయ్య చనిపోయిన జింకలను తన హస్తంతో తాకడంతో అవి ప్రాణంతో లేచి అడవిలోకి పారిపోయాయి. వేటగాళ్లు చలించి పోయారు. మాన్వి కొండ గుహలో బ్రహ్మముహూర్తంలో తపస్సులో ధ్యానం చేసేవారు. మాన్వి నగరసభ ఎన్నికల్లో గోదావరి విజయం సాధించాలంటూ ఆశీర్వదించగా ఆమె విజయం సాధించారు. వివాహం కాని బాలమ్మకు వివాహం జరుగుతుంది. మట్కా ప్రియులకు అత్యంత ప్రీతిపాత్రుడు అన్నమయ్య తాతగా పేరొందారు. మాన్విలో మూగవాడికి మాట్లాడే శక్తిని ప్రసాదించారు. మైనార్టి ఖాసింసాబ్‌ మిఠాయిల వ్యాపారం చేసేవాడు. గుప్త నిధుల పేరుతో గుంతలు తవ్విన స్థలంలో బొగ్గులు లభించాయి. ఈ విషయంలో అన్నమయ్య వాటిని బంగారం చేసిచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నమయ్య మహిమలు అనేకం. కాగా సోమవారం నుంచి మహాయోగి అన్నమయ్య తాత ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 40వ వార్షికోత్సవ పూజలను చేపట్టనున్నారు. ఆలయం వద్ద రాతి దూలాలు ఎత్తే పోటీలు, పల్లకీ సేవలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.

మహిమాన్వితుడు.. అన్నమయ్య తాత1
1/2

మహిమాన్వితుడు.. అన్నమయ్య తాత

మహిమాన్వితుడు.. అన్నమయ్య తాత2
2/2

మహిమాన్వితుడు.. అన్నమయ్య తాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement