దోమల నివారణపై జాగృతి | - | Sakshi
Sakshi News home page

దోమల నివారణపై జాగృతి

Nov 4 2025 7:20 AM | Updated on Nov 4 2025 7:20 AM

దోమల

దోమల నివారణపై జాగృతి

రాయచూరు రూరల్‌: నగరంలో దోమల నివారణపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టి జాగృతి కల్గించారు. సోమవారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయం, మానవ హక్కుల సంఘం, అవినీతి నిర్మూలన కమిషన్‌ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద కాలనీ, జ్యోతి కాలనీ, ఐబీ కాలనీల్లో ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయం అధికారిణి సంధ్య, మానవ హక్కుల సంఘం అవినీతి నిర్మూలన కమిషన్‌ అధ్యక్షుడు రాజాశంకర్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు తప్పని

ఫుట్‌బోర్డు ప్రయాణం

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం పంచ గ్యారంటీల పేరుతో చేపట్టిన శక్తి పథకంతో తగినన్ని బస్సులు లేక విద్యార్థులకు ఫుట్‌బోర్డుపై సంచారం తప్పని తిప్పలుగా మారింది. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు అధికంగా ప్రయాణించడంతో విద్యార్థులకు సీట్లు లభించక చివరికి షుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి దాపురించింది. సోమవారం జిల్లాలోని సిరవార–కవితాళ మధ్య విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి బస్సు కోసం ఎదురు చూశారు. చివరికి గత్యంతరం లేక ఫుట్‌బోర్డు మీద నిలబడి ప్రయాణించారు. సమయానికి బస్సులు రాకపోవడంతో వేళకు పాఠశాలకు చేరుకోలేక పోయారు. ఈనేపథ్యంలో ఆర్టీసీ అధికారులు విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా మరిన్ని బస్సులు నడపాలని కోరుతున్నారు.

ఉపాధ్యాయుల పాత్ర కీలకం

రాయచూరు రూరల్‌: విద్యార్థుల్లో మార్పు తేవడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని యాదగిరి నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపురె అన్నారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. పని ఒత్తిడి మధ్య విధులు నిర్వహించే ఉపాధ్యాయులు నలుగురికి సహాయం చేసి సమాజ సేవకు పునీతులు కావాలన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

రోడ్డు ప్రమాదంలో

తీవ్ర గాయాలు

రాయచూరు రూరల్‌: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యాదగిరికి చెందిన వీరేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో రాయచూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వీరేష్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన కళ్యాణ్‌ అభిమాని అని తండ్రి తిమ్మయ్య తెలిపారు. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీరేష్‌ను ఆదుకోవాలని కోరుతూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియో వైరల్‌ అయింది.

చెరువుల అభివృద్ధికి

నిధులు కేటాయించాలి

కోలారు: జిల్లా వ్యాప్తంగా శిథిలమైన చెరువులు, కట్టలు, తూములను అభివృద్ధి చేయడానికి నిధులు విడుదల చేయాలని రైతు సంఘం ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ అన్నారు. ప్రభుత్వ అతిథిగృహంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రభుత్వం వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నా...అధికారులు నకిలీ బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. నిధులు స్వాహా చేసిన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టెండర్‌ దారులు, అధికారుల ఆస్తులను వేలం వేయాలని, చెరువుల నుంచి వృథాగా వెళ్తున్న నీటిని పంట పొలాలకు అందించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వక్కలేరి హనుమయ్య, సుప్రీంచల పాల్గొన్నారు.

దోమల నివారణపై జాగృతి 1
1/4

దోమల నివారణపై జాగృతి

దోమల నివారణపై జాగృతి 2
2/4

దోమల నివారణపై జాగృతి

దోమల నివారణపై జాగృతి 3
3/4

దోమల నివారణపై జాగృతి

దోమల నివారణపై జాగృతి 4
4/4

దోమల నివారణపై జాగృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement