బుజ్జికుక్కను నేలకు కొట్టి హత్య | Bengaluru maid caught on CCTV pet puppy | Sakshi
Sakshi News home page

బుజ్జికుక్కను నేలకు కొట్టి హత్య

Nov 4 2025 11:19 AM | Updated on Nov 4 2025 11:19 AM

Bengaluru maid caught on CCTV pet puppy

∙సిలికాన్‌ సిటీలో పనిమనిషి అరెస్టు 

బెంగళూరు: ఇంటి పనిమనిషికి తిక్కరేగి కుక్కపిల్లను ఎత్తి నేలకు కొట్టి చంపిన ఘటన బెంగళూరులో బాగలూరు అపార్టుమెంట్‌లో జరిగింది. వివరాలు.. ఎంబీఏ విద్యార్థిని  రాశి పూజారి నాలుగేళ్ల నుంచి చిహువా జాతికి చెందిన బుజ్జి కుక్కను పెంచుతోంది. దీనికి గోపి అని పేరుపెట్టింది, గోపి ఎంతో అన్యోన్యంగా ఉండేది. బర్త్‌ డేకు కేక్‌ కూడా కత్తిరించేది. రాశిపూజారి తాను కాలేజీకి వెళ్లినప్పుడు గోపిని చూసుకోవడానికి పుష్పలతా అనే మహిళను పని మనిషిగా పెట్టుకుంది.

గతనెల 31వ తేదీన గోపిని వాకింగ్‌ కు తీసుకెళ్లిన పుష్పలత కుక్కపిల్ల మెడలో ఉన్న బెల్ట్‌ పట్టుకుని గట్టిగా నేలకేసి బాదడంతో కుక్కపిల్ల చనిపోయింది. ఈ కిరాతక దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. లిఫ్టులో నుంచి పడి శునకం మృతిచెందిందని అబద్దం చెప్పింది. కానీ సీసీ కెమెరాలను పరిశీలించగా గుట్టు బయటపడింది.  ఇన్‌స్టా లో రాశి పూజారి తన బాధను వెళ్లబోసుకుంది. కుక్క ని చంపేసిందని, అంతేగాక తన ఇంట్లో బంగారం కాజేయడానికి ప్లాన్‌ వేసిందని పనిమనిషిపై ఆమె బాగలూరు ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement