బెంగళూరులో ఇంటి యజమానుల దోపిడీ
బెంగళూరు: ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగరంలో అద్దె ఇంటి అడ్వాన్స్‌లు అదరగొడుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం ఇక్కడకు పెద్దఎత్తున వలస వస్తూ ఉండడంతో ఈ నగరానికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో కొందరు ఇళ్ల యజమానులు దోపిడీకి హద్దేలేకుండా పోతోంది. ఫలితంగా.. అద్దెలు ఇంటి అడ్వాన్స్‌లు చుక్కల్నంటుతేన్నాయి. ఈ నేపథ్యంలో.. ఓ డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి ఇటీవల ఓ యజమాని పెట్టిన డిమాండ్ చూసి జనం షాక్ అయ్యారు.
బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌కు టులెట్ బోర్డు పెట్టారు. పనిలో పనిగా రూ.30 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని షరతు విధించారు. ఇదే విషయాన్ని కొందరు ‘రెడ్డిట్’ వెబ్‌సైట్‌లో షేర్ చేయడంతో ఇళ్ల అద్దెలపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రూ.30 లక్షల డిపాజిట్ చేయడానికి బదులు బిల్డర్ వద్ద ఫ్లాట్‌ను కొనుగోలు చెయ్యొచ్చని నెటిజన్లు కామెంట్లు చేశారు. అలాగే, ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ప్రకటన అని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరైతే.. బెంగళూరులో ఇంటి అడ్వాన్స్‌లు పెద్ద దందాగా మారిందని ఆరోపించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
