నిరుపయోగంగా ఆరోగ్య మందిరం
హొసపేటె: చుట్టు ముళ్ల కంపలు, ముందు చెత్త చెదారం, ఒక వైపు దుర్వాసనతో కూడిన పరిసరాలతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. హొసపేటె తాలూకా మరియమ్మనహళ్లి పట్టణంలోని 9వ వార్డులోని ఆరోగ్య శాఖకు చెందిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర కేంద్రం దుస్థితి ఇది. ప్రజల ప్రయోజనం కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి భవనాన్ని నిర్మించింది. కానీ సంబంధిత శాఖ ఆసక్తి చూపలేదు. సుమారు 2–3 వేల మంది జనాభా ఉన్నా ఈ భవనాన్ని దాని ఉద్దేశిత ప్రయోజనాల కోసం ఉపయోగించడం లేదు. ఒక వైపు గత 2 సంవత్సరాలుగా ప్రతి రోజూ తలుపులు మూసే ఉన్నాయి.
తలుపులు, కిటికీలు ధ్వంసం
నిర్లక్ష్యం కారణంగా సబ్ సెంటర్ తలుపులు, కిటికీలు ధ్వంసానికి గురవుతున్నాయి. భవనం రోజురోజుకు శిథిలావస్థకు చేరుతోంది. అంతేకాదు కలుపు మొక్కలు పెరిగాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక్క సిబ్బంది కూడా లేకుండా ప్రజలు ఇప్పుడు వైద్య సేవలకు దూరమవుతున్నారు.
రూ.లక్షలాది నిధులు వృథా
వార్డు నివాసులు కూడా వైద్య సేవలను కోల్పోతున్నారు. ఏడాదిన్నర క్రితం జూనియర్ మహిళా హెల్త్ అసిసెంట్ల నియామకం తర్వాత ఈ కేంద్రం మూసివేశారు, ఇప్పటి వరకు తెరవలేదు. ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల గ్రాంట్‌తో మహిళల కోసం నిర్మించిన ఈ జూనియర్ మహిళా హెల్త్ అసిస్టెంట్ కేంద్రానికి ఎవరూ రావడం లేదు. అందువల్ల ఆరోగ్య సేవలు కూడా సన్నగిల్లాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
శిథిలావస్థకు భవనం
వైద్య సేవలు దూరం


