దావణగెరెలో గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి మల్లికార్జున
హొసపేటెలో మాట్లాడుతున్న మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్
బళ్లారిలో ఉత్తమ విద్యార్థులకు పురస్కారాలు అందిస్తున్న రహీంఖాన్
సాక్షి, బళ్లారి: కన్నడ భాష మనుగడను కాపాడుకోడానికి ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని పురపాలక, హజ్ శాఖ మంత్రి రహీంఖాన్ పేర్కొన్నారు. ఆయన శనివారం 70 కన్నడ రాజ్యోత్నవాన్ని పురస్కరించుకుని నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి మాత చిత్రపటానికి పూలమాలలు సమర్పించిన అనంతరం మాట్లాడారు. కేవలం ఇంగ్లిష్ భాష బాగా వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు వస్తాయని భ్రమలో ఉండటం సరికాదన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉదాహరణకు చైనా, జపాన్ వంటి దేశాలు మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తాయని గుర్తు చేశారు. కన్నడిగులు ఎంతో శాంత స్వభావులని, సోదరభావంతో మెలుగుతూ ఇక్కడ అన్ని భాషల వారికి బతికేందుకు అవకాశం కల్పిస్తారన్నారు. 1956 నవంబర్ 1వ తేదీ నుంచి కన్నడ రాజ్యోత్సవాన్ని జరుపుకోవడానికి ఎంతో చరిత్ర ఉందని గుర్తు చేశారు. కన్నడ పర పోరాట యోధుల సేవలను మనందరం ఎన్నటికీ మరిచిపోకూడదన్నారు. జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, ఎస్పీ శోభారాణి, మేయర్ ముల్లంగి నందీష్, ప్రముఖులు ముండ్రిగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కన్నడ రాజోత్సవం పురస్కరించుకుని వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులను ఘనంగా సన్మానించారు. అంతకు ముందు నగరంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భువనేశ్వరి మాత చిత్రపటాలను ఊరేగించడంతో పాటు వివిధ వేషధారణలతో కళాకారులు చూపరులను ఆకట్టుకున్నారు.
బీఎంసీఆర్‌సీలో ..
బళ్లారి రూరల్ : కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా శనివారం బీఎంసీఆర్‌సీలో వైభవంగా రాజ్యోత్సవాన్ని నిర్వహించారు. కన్నడ మాత భువనేశ్వరి చిత్రపటానికి పూజలు నిర్వహించి ఊరేగించారు. కన్నడ బావుటాను రెపరెపలాడిస్తూ వైద్యవిద్యార్థులు విన్యాసాలు చేశారు. యువవైద్యులు ఉత్సాహంగా మోటారుబైక్ ర్యాలీని నిర్వహించారు. బీఎంసీఆర్‌సీ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ గంగాధరగౌడ, ప్రిన్స్‌పాల్ డాక్టర్ మంజునాథ్, సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, వైద్యులు, యువవైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మన కన్నడ భాష మన అస్తిత్వం
మన కర్ణాటక మన కన్నడ భాష మన అస్తిత్వం అని దావణగెరె జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర గనులు భూవిజ్ఞాన, ఉద్వానవన శాఖ మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున తెలిపారు. శనివారం కన్నడ రాజ్యోత్సవంలో భాగంగా జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మన కన్నడ భాషలో మాట్లాడటం, చదవటం, రాయటంతో పాటు కన్నడ భాషను గౌరవిద్దామని అన్నారు. రాష్ట్ర ప్రజలందరి అభివృద్ధికి ప్రభుత్వం ఐదు గ్యారంటీలను అమలు చేయడంతో ఆర్థిక, సామాజిక, విద్యా సమానతలు ఏర్పడుతున్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా కన్నడ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున, జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి, జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్, జెడ్పీ సీఈఓ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాభివృద్ధికి శ్రమిస్తా
రాయచూరు రూరల్: భాష, ప్రాంతీయ అసమానతల నివారణ మధ్య కళ్యాణ కర్ణాటకకు నిజాం పాలన నుంచి విముక్తి లభించినా రాష్ట్రానికి, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. శనివారం 70వ రాష్ట్రవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మగాంధీ క్రీడాంగణంలో పతాకావిష్కరణ గావించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 1956 నవంబరు 1న 19 జిల్లాలతో కర్ణాటక రాష్ట్రం ఏర్పడిందన్నారు. కన్నడ భాషకు 8 జ్ఞానపీఠ అవార్డులు లభించాయని గుర్తు చేశారు. పతాకావిష్కరణలో ఎంపీ కుమార నాయక్, ఎమ్మెల్యేలు శివరాజ్ పాటిల్, బసన గౌడ, ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, సమాచార హక్కు కమిషనర్ వెంకట సింగ్‌లున్నారు. నగరంలో వివిధ రంగాలలో సేవలందించిన వారికి ఎడెదొరె నాడు అవార్డులను ప్రదానం చేశారు.
కరవే రాజ్యోత్సవ ఆచరణ
కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కర్ణాటక రక్షణా వేదిక ప్రముఖులు, కార్యకర్తలు నేతాజీ నగర్ సర్కిల్‌లో కన్నడ ధ్వజారోహణ గావించారు. నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్, రవికుమార్ భువనేశ్వరి మాత చిత్రపటానికి పూజలు చేశారు. నేతాజీ నగర్‌లో కన్నడ కళా యువ వేదిక ఆధ్వర్యంలో సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య స్వామీజీ కన్నడ ధ్వజాన్ని ఎగురవేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నగరంలోని కర్ణాటక సంఘ్ నుంచి భువనేశ్వరి చిత్రపటాన్ని పురవీధుల గుండా ఊరేగించారు.
కన్నడ ముద్దు.. ఆంగ్లం వద్దు
చెళ్లకెరె రూరల్: ఏదైనా సాధించడానికి భాష అడ్డు రాదని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. శనివారం బిసి నీరు ముద్దప్ప పాఠశాల ఆవరణలో 70వ కన్నడ రాజ్యోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు ఆంగ్ల భాషపై వ్యామోహానికి లోనై కన్నడ భాషను చిన్నచూపు చూడరాదన్నారు. కన్నడ భాష జన్మనిచ్చిన తల్లితో సమానం అన్నారు. కన్నడ రాజ్యోత్సవాన్ని మాతృ జన్మదినోత్సవంగా ఆచరించాలన్నారు. కన్నడ భాష, భూమి, నీటి కోసం పోరాటం చేసిన మాజీ ముఖ్యమంత్రి చిత్రదుర్గ నిజలింగప్ప మొదలుకొని అనేక మంది మహానీయుల ఆదర్శాలను అలవరుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన సాధకులు 15 మందిని ఎమ్మెల్యే సన్మానించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అలరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రెహాన్ పాషా, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
భావి తరాలకు కన్నడ భాషను పరిచయం చేద్దాం
హొసపేటె: మన తదుపరి తరానికి కన్నడను, కన్నడ వైభవాన్ని తెలియజేయాల్సిన బృహత్తర బాధ్యత మనపై ఉందని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ.పరమ శివమూర్తి తెలిపారు. కన్నడ విశ్వవిద్యాలయంలోని క్రియా శక్తి భవనం ముందు శనివారం 70వ కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా జెండాను ఎగుర వేసిన తర్వాత ఆయన మాట్లాడారు. రాజ్యోత్సవం మనలో కన్నడ భావాన్ని, ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందన్నారు. విశ్వవిద్యాలయ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ బీ.గురుబసప్ప, వివిధ సంస్థల డీన్‌లు, వివిధ విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధన పండితులు, విద్యార్థులు హాజరయ్యారు.
పురపాలక, హజ్ శాఖ మంత్రి రహీంఖాన్
వాడవాడలా రాజ్యోత్సవ సంబరాలు
మైనార్టీ పాఠశాలల్లో కన్నడ భాషాభ్యాసం తప్పనిసరి
హొసపేటె: కన్నడ భాషను పురాతన చరిత్ర ఉంది. రాష్ట్రంలోని అన్ని మైనార్టీ పాఠశాలల్లో కన్నడ భాషాభ్యాసాన్ని తప్పని సరి చేయడానికి, ఉర్దూ పాఠశాలల్లో కన్నడను మొదటి భాషగా ప్రవేశ పెట్టడానికి చర్యలు తీసుకున్నామని గృహ నిర్మాణ, వక్ఫ్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి బీజెడ్.జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. నగరంలోని జిల్లా స్టేడియంలో శనివారం నిర్వహించిన 70వ కర్ణాటక రాజ్యోత్సవంలో జెండాను ఎగురవేసిన తర్వాత ఆయన మాట్లాడారు. కన్నడ భాషాభివృద్ధి అథారిటీ చైర్మన్ డాక్టర్ పురుషోత్తం బిళిమలె నేతృత్వంలో ప్రస్తుత సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 4300 ఉర్దూ పాఠశాలలు, అన్ని మదర్సాలు కన్నడను మొదటి భాషగా, ఉర్దూను రెండవ భాషగా, ఇంగ్లీషును మూడవ భాషగా ఎంచుకోవడాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు. జిల్లాలోని కూడ్లిగి తాలూకాలోని ఓబళశెట్టిహళ్లి గ్రామానికి చెందిన మంత్రసాని ఈరమ్మ తన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును, హొసపేటె నగరంలోని బాణదకేరి నివాసి బి.మారుతీ పెయింటింగ్ విభాగంలో రాజ్యోత్సవ అవార్డును అందుకోవడం హర్షణీయమన్నారు. జిల్లాధికారిణి కవిత, ఎస్పీ జాహ్నవి, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కన్నడ సంస్కృతిని కాపాడుకుందాం
కన్నడ సంస్కృతిని కాపాడుకుందాం
కన్నడ సంస్కృతిని కాపాడుకుందాం
కన్నడ సంస్కృతిని కాపాడుకుందాం
కన్నడ సంస్కృతిని కాపాడుకుందాం
కన్నడ సంస్కృతిని కాపాడుకుందాం
కన్నడ సంస్కృతిని కాపాడుకుందాం
కన్నడ సంస్కృతిని కాపాడుకుందాం


