ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
రాయచూరు రూరల్: మనిషి తన జీవితంలో భక్తిభావాలు పెంపొందించుకోవాలని బాళెహొన్నూరు రంభాపురి పీఠాధిపతి జగద్గురు ప్రసన్న రేణుక వీరసోమేశ్వర రాజ దేశికేంద్ర శివాచార్య పిలుపు ఇచ్చారు. శనివారం మాన్వి తాలూకా కరడిగుడ్డలో మహంతేశ్వర మఠం మహంత లింగ శివాచార్య మహా స్వామీజీ పట్టాధికార రజత మహోత్సవంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నేడు మనిషి పని ఒత్తిడితో ప్రతి నిత్యం ఎంతో మదన పడుతున్నాడన్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో స్వామీజీలు శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీర సంగమేశ్వర స్వామీజీ, మాజీ శాసన సభ్యులు బసన గౌడ, రాజా వెంకటప్ప నాయక్ తదితరులున్నారు.
నేడు పాండురంగ స్వామి
సన్నిధిలో విశేష పూజలు
బళ్లారిఅర్బన్: కార్తీక శుద్ధ ఏకాదశి బ్రహోత్సవం సందర్భంగా నగర సమీపంలోని 5వ వార్డు పరిధిలోని గుగ్గరహట్టి కృష్ణ కాలనీలో వెలసిన శ్రీరుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆలయంలో పంచామృతాభిషేకం, కాకడ హారతి, అనంతరం మహామంగళ హారతి నెరవేరనున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఆలూరు మండలం కొక్కరచేడులోని శంకరానందగిరి గురుస్వామి మఠం గురు శరణానంద గిరిమాతాజీ శరణమ్మ, గోల్డ్ షాపు కే.మల్లికార్జున కుటుంబ సభ్యులు కార్తీక దీపోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం 7 గంటలకు శరణమ్మ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ పెద్దలు, భక్తులు తెలిపారు.
నగరసభ కమిషనర్
బదిలీకి డిమాండ్
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభ కమిషనర్‌ను బదిలీ చేయాలని రాయచూరు నగర ఉస్మానియా కాయగూరల విక్రయదారుల క్షేమాభివృద్ధి సంఘం అధ్యక్షుడు మహావీర్ డిమాండ్ చేశారు. శనివారం మహాత్మగాంధీ క్రీడా మైదానంలో మంత్రి శరణ ప్రకాష్ పాటిల్‌తో కలసి మాట్లాడారు. నగరసభలో విధులు నిర్వహిస్తున్న కమిషనర్ ఏనాడూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించకుండా వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం లేదన్నారు. అక్రమంగా నిర్మించుకున్న కూరగాయల మార్కెట్‌ను తొలగించాలన్నారు. బీజేపీ నేత రవీంద్ర జాలదార్ ప్రైవేట్ వ్యక్తుల సీఏ స్థలంలో వ్యాపారాలు చేస్తున్నారని, దానిని తొలగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
తుంగభద్ర ఆయకట్టులో రెండో పంటకు నీరివ్వండి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ కింద ఆయకట్టు పరిధిలో రెండో పంటకు నీరందించాలని మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, మాజీ ఎమ్మెల్యేలు బసన గౌడ బ్యాగవాట్, గంగాధర నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్ డిమాండ్ చేశారు. శనివారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో మంత్రి శరణ ప్రకాష్ పాటిల్‌ను కలిసి మాట్లాడారు. రబీ పంటకు నీరందించడానికి ముందుకు రావాలన్నారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల అమరికకు డ్యాంలో 50 టీఎంసీల నీరున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయ నగర జిల్లాల ఇంచార్జి మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి రెండవ పంటకు నీరు విడిపించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
సేవాదళ్‌లో వేడుకలు
కోలారు: నగరంలోని భారత్ సేవాదళ్ కార్యాలయంలో రాజ్యోత్సవాలను నిర్వహించారు. భారత్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సిఎంఆర్ శ్రీనాథ్, కేఎస్ గణేష్ తదితరులు మాట్లాడుతూ కన్నడ భాషకు 2500 సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. కన్నడ భాష అంకెల సంఖ్యలు కలిగిన సర్వాంగీణ భాష అన్నారు. ఇది ద్రావిడ భాషలలో అత్యంత వైశిష్టత కలిగి ఉందన్నారు. ఎస్ సుధాకర్, సైన్స్ నాగరాజ్, బహద్దూర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత


