
పాత పద్ధతిలోనే డ్రైనేజీ మ్యాన్‌హోల్ శుద్ధి
హుబ్లీ: కేఎంసీ ఆస్పత్రి ఆవరణలో అప్పుడప్పుడు రోగుల అశ్రద్ధ తదితర కారణాల వల్ల కూడా డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లు నిండి కింది ఫ్లోర్లలోని వార్డుల్లో రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఇటీవల మానసిక వార్డు నెంబర్– 15 జనరల్ పురుషుల విభాగంలో మరుగుదొడ్లు బ్లాక్ కావడంతో ఎంతో ఇబ్బంది ఏర్పడింది. ఫలితంగా రోగులు, వారి సహాయకులు రెండు రోజుల పాటు మరుగుదొడ్ల వినియోగం ఆగిపోవడంతో ఉన్న పైఅంతస్తులోని వమరుగుదొడ్లను వాడుకున్నారు. ఆ తర్వాత వాటి మరమ్మతులు చేపట్టారు. తాజాగా పేద రోగుల పాలిట సాక్షాత్తు ఆశ్రయ ఆరోగ్య పునర్ జీవ ప్రసాదిత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేత్రి సుధామూర్తి నిధులతో నిర్మించిన ధర్మశాలలో బయట ఉన్న డ్రైనేజీ చాంబర్ బ్లాక్ కావడంతో సమస్య ఏర్పడింది. దీంతో సంబంధిత కార్మికులు మానవ పారిశుధ్య పద్ధతులకు ఏనాడో స్వస్తి చెప్పిన కారణంగా నాలుగు రోజులు ఉద్యోగులు దాదాపు గురువారం 4, 5 గంటల పాటు శ్రమించి పేరుకున్న చెత్తాచెదారం తొలగించి మరుగుదొడ్లలో నీరు సజావుగా పారేలా కృషి చేశారు. ఈ ఆవరణలో సుధామూర్తి కొత్త ధర్మశాలతో పాటు గత నాలుగు దశాబ్దాల నుంచి కూడా ఉన్న ధర్మశాల పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా క్యాన్సర్ తదితర చివరి దశ లేదా వారం, నెల రోజుల పాటు కిమోథెరపీ, రేడియేషన్ తదితర చికిత్స తీసుకొనే పేద రోగులకు ఈ పాత కట్టడం ధర్మశాలగానే ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నారు.
అభద్రతలో పారిశుధ్య కార్మికులు
చాంబర్ బ్లాక్ కావడంతో సమస్య