
ఇంటింటా స్వదేశీ వస్తువులనే వాడాలి
సాక్షి బళ్లారి: ప్రతి ఇంట్లో స్వదేశీ వస్తువులనే ఉపయోగించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం నేపథ్యంలో స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్న అభియాన్‌ను సెప్టెంబర్ 25న పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి రోజున ప్రారంభించామని, డిసెంబర్ 25న భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి రోజున అభియాన్‌ను ముగిస్తామని ఎమ్మెల్సీ వైఎం సతీష్ అన్నారు. ఈ అభియాన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్న చైతన్యాన్ని ప్రతి ఒక్కరిలో నింపాలన్నారు. హర్‌ఘర్ స్వదేశీ, ఘర్ ఘర్ స్వదేశీ అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా వినిపించాలని, ఆ దిశగా కార్యక్రమాన్ని చేపడతామన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యకర్తలు, మహిళా, యువ సమ్మేళనాలు, వ్యాస, రథయాత్ర, పాదయాత్ర, స్వదేశీ మేళా, వీధి నాటకాలు తదితర జనజాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. దీపావళి రోజున స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని కోరారు. ప్రతి ఒక్క భారతీయుడు చైతన్యం పొంది స్వదేశీ వస్తువుల కొనుగోలుపై దృష్టి సారించాలన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, బీజేపీ ప్రముఖులు డాక్టర్ బీకే సుందర్, కేఎస్ దివాకర్, గురులింగనగౌడ, హనుమంతప్ప, రామచంద్రయ్య, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధికి తోడ్పడాలి
ఎమ్మెల్సీ వైఎం సతీష్