
బడికి స్థలం ఇవ్వరూ..
హుబ్లీ: హావేరి జిల్లా హిరెకేరూరు తాలూకా స్కోడా గ్రామ పంచాయతీ పీడీఓ బాలికల పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని బహుగ్రామ తాగునీటి పథకానికి ఇచ్చారు. దీంతో స్థానికులు ఆ స్థలాన్ని వదిలి వేరే చోట ఎక్కడైనా స్థలాన్ని తాగునీటి పథకం కోసం వాడుకోవచ్చని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వారు మాట్లాడుతూ ఓ దాత మా ఊరు బాలికల పాఠశాల కోసం 10 గుంట్ల స్థలాన్ని ఇచ్చారు. ప్రస్తుతం దాని విలువ కోటి రూపాయల పైనే. బాలికలు చదువుకునేందుకు పాఠశాల కట్టాల్సి ఉంది. పీడీఓ ఆ స్థలాన్ని సదరు నీటి పథకానికి ఇచ్చారని, దీన్ని తాము అంగీకరించబోమని గ్రామస్తులు తెగేసి చెప్పారు. స్కోడా గ్రామం లోపల ఉండే బాలికల పాఠశాలకు సరైన స్థలం లేదు. ఇరుకై న స్థలంలో పాఠశాల నడుపుతున్నారు. పాఠశాలకు మైదానం లేదు. అవసరమైన భవనం లేదు.
130 మందికి పైగా విద్యాభ్యాసం
అయినా ఈ పాఠశాలలో 130 మందికి పైగా బాలికలు చదువుతున్నారు. ఇక్కడ కాంపౌండ్ కూడా లేదు. సరైన గదుల వసతి కూడా లేదు. ఈ నేపథ్యంలో గ్రామస్తుడు నాగేశ్వర్ బిజాపుర అనే వ్యక్తి తనకు చెందిన 10 గుంట్ల స్థలాన్ని ఆ గ్రామ బాలికల పాఠశాల నిర్మించడానికి 2012లోనే ఆ మేరకు దాన పత్రాన్ని కూడా ఆ పంచాయతీ అధికారులకు అందజేశారు. ఈ నిర్ణయంపై గ్రామ పంచాయతీలో అనుమతి తీసుకొని గవర్నర్ తరపున హిరేకెరూరు బీఈఓ పేరున నమోదు అయింది. అయితే ఇటీవల ఆ గ్రామ పీడీఓ కేఎం బన్నికోడ, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, సభ్యులు ఆ స్థలాన్ని స్కోడా వద్ద సర్వజ్ఞ బహుగ్రామ తాగునీటి పథకం భవన నిర్మాణం కోసం వినియోగించుకోవాలని పంచాయతీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ స్థలంలో రూ.కోట్ల వ్యయంతో బహుగ్రామ తాగునీటి పథకం భవన నిర్మాణం జరిగింది.
పనుల నిలిపివేతకు ఆదేశం
ఘటనపై హిరేకెరూరు బీఈఓకు పాఠశాల ఎస్‌డీఎంసీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ కట్టడ నిర్మాణ స్థలానికి వెళ్లి పరిశీంచిన బీఈఓ ఆ పనులను నిలిపి వేయాలని పాఠశాల కట్టడం కోసం దానం ఇచ్చిన ఈ స్థలంలో తాగునీటి భవనం నిర్మించారని గ్రామస్తులు ఒత్తిడి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోను ఈ స్కూల్ నిర్మాణ అవకాశాన్ని తాము వదలబోమని కనీసం ఇప్పటికై న పాఠశాల నిర్మాణానికి మరో స్థలాన్ని తక్షణమే కేటాయించాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హిరెకేరూరు ఎమ్మెల్యే ఏబీ బణకార్ మాట్లాడుతూ.. పాఠశాల నిర్మాణం కోసం ప్రభుత్వ లేదా బంజరు స్థలాన్ని కొనుగోలు చేయడానికి మేం రెడీగా ఉన్నాం. ప్రత్యామ్నాయంగా ఓ స్థలాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.
స్కూల్‌కు స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు
అర్ధంతరంగా ఆగిపోయిన తాగునీటి పథకం భవన నిర్మాణ పనులు
దాత పాఠశాలకు ఇచ్చిన స్థలాన్ని
తాగునీటి పథకానికి
కేటాయించిన పీడీఓ
పాఠశాలకు మైదానం లేక
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
వేరే స్థలం ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్

బడికి స్థలం ఇవ్వరూ..