
పంచాయతీ అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: రాయచూరు తాలుకా గిల్లె సూగురు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్త అంబాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పాత్రికేయుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్–75లో ఉన్న ప్రభుత్వ భూమిలో గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు మహదేవమ్మ ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. ఇళ్ల ద్వారా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు బాడుగ వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న పంచాయతీ అధ్యక్షురాలు మహదేవమ్మ, ఆమె భర్త మల్లేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నగర
ఉపాధ్యక్షుడిగా కేశవమూర్తి
రాయచూరు రూరల్: రాయచూరు నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కేశవమూర్తిని నియమిస్తూ కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు ఖాళీగా ఉన్న నగర ఉపాధ్యక్షుడి పదవిని గురువారం భర్తీ చేశారు. 25 ఏళ్ల పాటు కార్యకర్తగా విధులు నిర్వర్తించిన కేశవమూర్తి సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు పదవిని కట్టబెట్టింది.
అదనపు న్యాయమూర్తి
ఇంట్లో చోరీ
● ముగ్గురు నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: అదనపు న్యాయమూర్తి నివాసంలో దొంగలు చొరబడి బంగారం, నగదు దొంగిలించిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. ముద్దే బిహళ తాలుకా దండాదికారి అద్దె నివాసంలో అదనపు న్యాయమూర్తి ఉంటున్నారు. ఇంటి తాళం పగుల గొట్టిన దొంగలు.. రూ.30,15,500 విలువ చేసే బంగారం, నగలు ఎత్తుకెళ్లారు. విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. బెళగావి జిల్లా రామదుర్గ తాలుకా రాంపుర తాండా సునీల్ రజపూత్, నాగనూరు తాండా చేతన్ లమాణి, సవదత్తి తాలుకా కార్ల్కట్టి రాహుల్ లమాణిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
కళ్యాణ కర్ణాటక
సమగ్రాభివృద్ధికి జాతా
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగం సమగ్ర అభివృద్ధి కోసం జాతాకు శ్రీకారం చుట్టినట్లు వేల్ఫేర్ పార్టీ ఆప్ ఇండియా అధ్యక్షుడు తాహిర్ హుసేన్ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అరున బళ్లారి నుంచి ప్రారంభమైన జాతా అక్టోబర్ 13న కలబుర్గికి చేరుకుంటుందన్నారు. ఈ ప్రాంతం విద్య, వైద్య, ఆర్థిక, సాంఘిక రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వం నుంచి రూ.15 వేల కోట్ల నిధులు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. క.క.భాగంలో పరిశ్రమలు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు బెంగళూరు, ముంబాయి, హైద్రాబాద్, గోవా వంటి ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలస వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర సర్కార్ మొండి వైఖరని ఖండిస్తూ క.క భాగం అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై పూర్తి నివేదికలను మండలి అధ్యక్షుడికి వినతిపత్రం ద్వారా సమర్పిస్తామన్నారు.
వర్షాలకు నేలకూలిన ఇళ్లు
హుబ్లీ: దార్వాడ, దావణగెరె జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలతో 70 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దార్వాడ–దావణగెరె రెండు జిల్లాల్లో అపార నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో రైతులు, వ్యాపారులు, జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే కోనారెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు సాంత్వన పలికారు. పిడుగుపాటుకు మేకలు మృతి చెందడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మేకలు మంద ను పొలంలో ఉండగా పిడుగు పడటంతో 10 మేకలు మృతి చెందాయి. త్రుటిలో గొర్రెల కాపరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

పంచాయతీ అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోండి

పంచాయతీ అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోండి

పంచాయతీ అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోండి