
సీజేఐపై బూటు విసరడం హేయం
న్యాయవాదిని శిక్షించాలని వినతిపత్రం
అందజేస్తున్న దృశ్యం
పాత డీసీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజాపరివర్తన వేదిక కార్యకర్తలు
సాక్షి, బళ్లారి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయిపై న్యాయవాది బూటు (షూ) విసరడం అత్యంత హేయమైన చర్య. సీజేఐకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని పలు ప్రజా సంఘాలు, న్యాయవాదులు తీవ్ర స్థాయిలో ఖండించారు. శుక్రవారం జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధికారి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సీజేఐపై దాడి చేసిన న్యాయవాది రాకేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రధాన న్యాయమూర్తితో ఇంత అనుచితంగా వ్యవహరించడం దేశంలో ఇదే మొదటిసారి అన్నారు. ఆయనకే రక్షణ లేకుంటే ఇక ఎవరికి భద్రత కల్పిస్తారని మండిపడ్డారు. అనంతరం జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల సంఘం కార్యదర్శి అన్సర్ భాషా, ప్రముఖ న్యాయవాదులు కోటేశ్వరరావు, మల్లికార్జున, గురు బసవరాజు, దుర్గప్ప, జయకుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. దళిత పర సంఘటనల ఐక్య కూటమి ఆధ్వర్యంలో వెంకటేశ్, బండిహట్టి కిశోర్, వినోద్ కుమార్ తదితరులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై బూటు విసిరిన న్యాయవాదిని దేశం నుంచి బహిష్కరించాలని ప్రజాపరివర్తన వేదిక (పీపీవీ) నేతలు డిమాండ్ చేశారు. ఆ సంఘం నేతలు ఆనంద్ కుమార్, శివ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో జి.దివాకర్ బాబు, హనుమంతు, సిద్దబసప్ప తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదిని శిక్షించాలి
బళ్లారి రూరల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసిరిన న్యాయవాదిని శిక్షించాలని జిల్లా ప్రజాపరివర్తన వేదిక (పి.పి.వి) జిల్లాధ్యక్షుడు సి.ఆనంద కుమార్ కోరారు. శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. పాత డీసీ కార్యాలయం ముందు విలేకరులతో మాట్లాడారు. దళితుడైన న్యాయమూర్తి బి.ఆర్.గవాయిపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రముఖుడు లాయర్ రాకేశ్ కిశోర్ బూటు విసరడం దుర్మార్గమన్నారు. అనంతరం జిల్లా యంత్రాంగానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వై.శివకుమార్, కోశాధికారి జి.దివాకర బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంత తదితరులు పాల్గొన్నారు.

సీజేఐపై బూటు విసరడం హేయం