
ఉపాధ్యాయుల సేవాభావం
రాయచూరు రూరల్: సరిహద్దు ప్రాంతంలోని సర్కారీ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందనే కారణంతో బడుల మూసివేతకు సర్కార్ నిర్ణయం తీసుకుంటోంది. బెళగావి జిల్లా చిక్కోడి డివిజన్ హుక్కెరి తాలుకా గోటూర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆంగ్లంలో విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు. తాలుకా విద్యాశాఖ అధికారి అనుమతితో పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించారు. ఇందుకోసం తమ వేతనాల్లో కోత పెట్టించుకుని నిధులు సమకూర్చుకున్నారు. అలాగే ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. 40 మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చేరదీశారు. విద్యార్థులను ఆకర్షించేందుకు హాజరు శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు తీసుకుంటున్న చొరవను స్థానికులు అభినందించారు. ప్రభుత్వం నుంచి నిధులు ఆశించకుండా సొంత డబ్బు వెచ్చించి పాఠశాల నిర్వహణ చేస్తున్నారు.
సొంత ఖర్చులతో ఎల్‌కేజీ,
యూకేజీ తరగతులు ప్రారంభం
గోటూర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్లంలో విద్యాబోధన

ఉపాధ్యాయుల సేవాభావం