
చెరువులను స్వాధీనం చేసుకుంటాం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఆక్రమణకు గురైన 41,849 చెరువులను డిసెంబర్ నాటికి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. గురువారం సాయంత్రం బెంగళూరు వికాస సౌదలో నీరిద్దరే నాళె కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర పరిధిలో ఏచ్.ఏన్,వ్యాలి, కేసీ వ్యాలీ చెరువులను నీటితో నింపడంతో భూగర్బ జలమట్టం పెరిగినట్లు తెలిపారు. చెరువులకు సంఘాల ద్వార పునరుజ్జీవం కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పంచ గ్యారెంటీలకు తోడు నీరు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టడం జరిగిందని పర్యటక శాఖ మంత్రి హెచ్.కే.పాటిల్ వివరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్, మంత్రులు ఈశ్వర్ ఖండ్రే, మహదేవప్ప, బీఆర్ పాటిల్, నసీర్ అహ్మద్, అజయ్ సింగ్, రిజ్వాన్ హర్షద్, ఎంవై పాటిల్, క్రిష్ణమూర్తి, హంపయ్య నాయక్, బాగీరథి, బసనగౌడ తదితరులు పాల్గొన్నారు.
నీరిద్దరే నాళె కార్యక్రమానికి శ్రీకారం