
లంచం డిమాండ్ చేసిన ఎస్‌ఐ సస్పెండ్
రాయచూరు రూరల్: కేసులో నమోదు చేసిన పేర్లను తొలగించేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన రాయచూరు తాలుకా ఇడపనూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సౌమ్య హిరేమట్‌ను సస్పెండ్ చేస్తూ బళ్లారి ఐజీపీ వర్తిక కటియార్ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. రాయచూరు తాలుకా ఇడపనూరు పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సౌమ్య హిరేమట్ భూమి తగాదా విషయంలో కేసు నమోదు చేశారు. విరున గౌడ, అనసూయమ్మ పాటిల్ మధ్య ఉన్న కేసు పరిష్కారం కోసం అనసూయమ్మ నుంచి రూ.3 లక్షల డబ్బు డిమాండ్ చేశారు. ఎవరికీ తెలియకుండా నగదును పోలీస్ కానిస్టేబుల్‌కు ఇచ్చి పంపాలని మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. అలాగే అనసూయమ్మ భర్త మహేష్ అక్రమంగా ఇసుక రవాణా చేయాలని సదరు ఎస్‌ఐ ఆదేశించారు. ఈ ఆడియోపై అదనపు ఎస్పీ కుమార స్వామి విచారణ చేపట్టారు. గురువారం రాత్రి ఇడపనూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సౌమ్య హిరేమట్‌ను సస్పెండ్ చేస్తూ బళ్లారి ఐజీపీ వర్తిక కటియార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ చేసిన బళ్లారి ఐజీపీ వర్తిక కటియార్