
ముందుచూపుతో రింగ్‌రోడ్డు నిర్మించండి
కోలారు: రాబోయే 25 సంవత్సరాల్లో రవాణా సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో రింగ్ రోడ్డు నిర్మించేలా డీపీఆర్ తయారు చేయాలని ఎమ్మెల్యే కొత్తూరుమంజునాథ్ అధికారులకు సూచించారు. శుక్రవారం పీడబ్ల్యూడీ శాఖ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. రింగ్‌రోడ్డు వ్యాప్తి, భూస్వాధీనం, ఇందుకు కలుగుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. రింగ్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ కోసం రూ. 2.8 కోట్లతో టెండర్ పిలవడానికి సిద్దం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య లేకుండా చతుష్పథ రహదారిని నిర్మించాలని ఎమ్మెల్యే సూచించారు. తొలుత శాటిలైట్ మ్యాప్ చూసి అనంతరం స్థల పరిశీలన చేద్దామని తెలిపారు. ఎంపీ మల్లేష్‌బాబు, ఎమ్మెల్సీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.