జంబూసవారీకి కౌంట్‌డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

జంబూసవారీకి కౌంట్‌డౌన్‌

Oct 1 2025 1:57 PM | Updated on Oct 1 2025 1:57 PM

జంబూస

జంబూసవారీకి కౌంట్‌డౌన్‌

మైసూరు: నాడ హబ్బ మైసూరు దసరా రోజున జరిగే చారిత్రక జంబూ సవారీ ఊరేగింపును వీక్షించేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మైసూరు రాజవీధుల్లో గురువారం జంబూ సవారీ ఉత్సవం జరుగుతుంది. రాష్ట్రం, దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తరలివస్తున్నారు.

2 గంటలు ఆలస్యంగా

● ఈసారి సుమారు రెండు గంటల ఆలస్యంగా జంబూ సవారీ సాగనుంది.

● గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1:18 గంటల మధ్య శుభ ధనుర్‌ లగ్నంలో ప్యాలెస్‌ బలరామ ద్వారంలో నంది ధ్వజానికి సీఎం సిద్ధరామయ్య పూజ చేసి నాంది పలుకుతారు.

● సాయంత్రం 4:40 గంటల నుంచి 5:60 గంటల మధ్య కుంభ లగ్నంలో అభిమన్యు ఏనుగు మీద బంగారు అంబారీలో ప్రతిష్టించిన అధిదేవత శ్రీచాముండేశ్వరిదేవి విగ్రహానికి పుష్పార్చన చేస్తారు.

● వేదికపై నుంచి అంబారీకి పుష్పార్చన చేసేందుకు సీఎం, డీసీఎం, జిల్లా ఇంచార్జి మంత్రి, జిల్లాధికారి, నగర పోలీసు కమిషనర్‌, రాజవంశస్తులు యదువీర్‌ కృష్ణదత్తా, హైకోర్టు న్యాయమూర్తి ఉంటారు.

● పోలీసులు జరిపే కాగడాల ప్రదర్శన బన్నిమంటపం మైదానంలో సాయంత్రం 7 గంటలకు సాగుతుంది.

● మంగళవారం జరిగిన వాయుసేన సూర్యకిరణ్‌ విమానాల విన్యాసాలు ఉత్కంఠభరితంగా సాగాయి. రివ్వున ఎగురుతూ వైవిధ్యభరితంగా ఫీట్లు చేశాయి.

దసరా రోజున మహా ఊరేగింపు

రాచనగరికి తరలివస్తున్న ప్రజలు

జంబూసవారీకి కౌంట్‌డౌన్‌1
1/1

జంబూసవారీకి కౌంట్‌డౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement