
దొడ్డబళ్లాపురం: లోకాయుక్త పోలీసులు దాడి చేసిన సమయంలో పరారైన దేవనహళ్లి మహిళా ఎస్‌ఐ జగదేవి పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను లోకాయుక్త కోర్టు తిరస్కరించింది. వివరాలు.. ఓ బాలిక లైంగిక దాడికి గురికాగా ఆమె తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. అయితే నిందితుడికి వ్యతిరేకంగా చార్జ్ïÙట్ వేయడానికి జగదేవి రూ.లక్ష డిమాండ్ చేసింది.
అడ్వాన్స్‌గా రూ.25వేలు తీసుకుని మిగతా రూ.75వేలు జగదేవి సహోద్యోగిని తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. సమీపంలో ఉన్న జగదేవి తప్పించుకుని పారిపోయింది. ఈకేసులో జగదేవిని ఏ1 నిందితురాలిగా ఉన్నారు. అరెస్ట్ భయంతో ఎస్‌ఐ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంది. పోక్సో కేసులో బాధితురాలి తల్లి నుంచి లంచం డిమాండు చేయడం అమానుషమని పేర్కొన్న కోర్టు... జగదేవి పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది.