బళ్లారిఅర్బన్: విజయదశమిని పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఈఓ హనుమంతప్ప తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది భక్తుల సందడి బాగా పెరిగిందన్నారు. కనకదుర్గమ్మకు బంగారు ఆభరణాలతో దుర్గాష్టమి రోజు నుంచి పండుగ పూర్తయ్యేంత వరకు అలంకరణ ఏర్పాటు చేయగా అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. ఆలయ పరిసరాలు తెల్లవారు జామున 3 గంటల నుంచి భక్తుల సందడితో కిటకిటలాడాయి. వీఐపీ దర్శనానికి ఓ గంట సమయం పట్టగా సాధారణ దర్శనానికి సుమారు 3 గంటల నుంచి 4 గంటల సేపు క్యూలైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఆలయ నలువైపులా నాలుగు గోపురాలకు విద్యుత్ దీపాలంకరణ, వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టి పోలీస్, హోంగార్డ్స్ బందోబస్తు మధ్య దర్శనానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ ముందు భాగంలో ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక నృత్యాలు, ఆలయ ప్రాంగణంలో దేవి పురాణం, అమ్మవారి నమూనాను ఏర్పాటు చేసి ప్రతి రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారికి అలంకరణలను చేస్తున్నారు.
దుర్గాదేవి రూపంలో అమ్మవార్ల దర్శనం
దేవి నవరాత్రులను పురస్కరించుకుని 9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం అమ్మవారి ఆలయాల్లో దుర్గాదేవి రూపాల్లో అమ్మవార్లను అలంకరించి నవరాత్రి పూజలను జరిపారు. బళ్లారి కనకదుర్గమ్మ ఆలయంతో పాటు పటేల్ నగర్ చిన్నదుర్గమ్మ ఆలయంలో దుర్గాష్టమి పూజలను విశేషంగా నిర్వహించినట్లు అర్చకులు సంతోష్ స్వామి తెలిపారు. అమ్మవారికి అభిషేకం దుర్గాదేవి అలంకరణ భక్తులకు జలాభిషేకం, హోమ పూజలు, మహామంగళారతి, అన్నదానం జరిపారు. మిల్లర్‌పేట్ మల్నాడు దుర్గమ్మ ఆలయంలో దుర్గాదేవి అలంకరణ, మహామంగళారతి, భక్తులకు అన్నదానం చేశారు. బెంగళూరు రోడ్డు బెంకి మారెమ్మ ఆలయం, నగరేశ్వరి ఆలయం, వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం, చిన్న మార్కెట్ శాంభవి దేవి ఆలయం, హవంబావి సీతారామ ఆశ్రమం, ఏళు మక్కళ తాయమ్మ ఆలయం తదితర అమ్మవారి ఆలయాల్లో దుర్గాష్టమి పూజలను దసరా సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు విశేషంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన అర్చకులు తెలిపారు.
దర్శనానికి బారులు తీరిన భక్తులు
కిటకిటలాడిన అమ్మవారి ఆలయం
వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
రాయచూరు రూరల్ : జిల్లాలో మంగళవారం శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని కోటలోని కాళికా దేవి ఆలయంలో దేవిని పల్లకీలో ఊరేగించారు. మమదాపురలో మారికాంబ దేవి, కాస్‌బావి అంబా భవాని, కందగడ్డ మారెమ్మ దేవిని ఘనంగా అలంకరించారు. నిజలింగప్ప కాలనీలో దేవిగా అలంకరించారు. కిల్లే మఠంలో, ఉప్పరవాడి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయంలో గరుడ వాహనంలో స్వామిని ఊరేగించారు. బోళమానుదొడ్డి రహదారిలోని తాయాంబిక ఆలయంలో కిల్లే మఠం శాంతమల్ల శివాచార్యులు హోమం చేశారు.
కరుణించమ్మా.. కనకదుర్గమ్మా
కరుణించమ్మా.. కనకదుర్గమ్మా
కరుణించమ్మా.. కనకదుర్గమ్మా
కరుణించమ్మా.. కనకదుర్గమ్మా
కరుణించమ్మా.. కనకదుర్గమ్మా
కరుణించమ్మా.. కనకదుర్గమ్మా