
మార్కెట్లకు దసరా పండుగ శోభ
బళ్లారి రూరల్ : దేశంలోనే అతిపెద్ద పండుగగా దసరా పండుగకు పేరుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుపుకొంటున్న దసరా పండుగలో భాగంగా బుధవారం ఆయుధ పూజ, గురువారం విజయదశమిని జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరవాసులు, గ్రామీణులు పూలు, పండ్లు, అరటి పిలకలు, మావిడాకులు, కొత్త దుస్తులు, సరుకులు కొనడానికి ఎగబడ్డారు. దీంతో బెంగళూరు రోడ్డు, టైలర్ వీధి, తేరువీధి, బ్రాహ్మణ వీధులు కిక్కిరిశాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూర పూల ధర రూ.50 నుంచి రూ.70 వరకు పలికింది. ఏదిఏమైనప్పటికీ నగరంలో పండుగ సందడి నెలకొంది.
పూజ సామగ్రి కొనుగోలుదారులతో
మార్కెట్ కిటకిట
హొసపేటె: ఆయుధ పూజ, దసరా పండుగ సందర్భంగా మంగళవారం నగరంలో మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. దసరా నాడు మనం ఉపయోగించే సాధనాలు, యంత్రాలు, పుస్తకాలు, వాహనాలకు కృతజ్ఞతలు తెలియజేసే ఆచారం ఉంది. పూజ కోసం ఎర్ర చున్నీ, కొబ్బరికాయ, మామిడి ఆకులు, గంధం, పసుపు, అక్షతలు, పువ్వులు, అగరబత్తులు, పండ్లు, స్వీట్లు వంటివి అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. అరటి, చెరుకు ముక్కలు, పండ్లు, పూలతో పాటు తదితర పూజ సామగ్రిని నగరంలో ప్రధాన వీధుల్లో అమ్మకందార్లు అందుబాటులో ఉంచారు.
కొత్త దుస్తులు, పూలు, పండ్లు,
మామిడాకుల కొనుగోళ్ల సందడి
బెంగళూరు రోడ్డు, బ్రాహ్మణ వీధి,
తేరువీధుల్లో ట్రాఫిక్ జామ్

మార్కెట్లకు దసరా పండుగ శోభ

మార్కెట్లకు దసరా పండుగ శోభ