
హస్తం ఎమ్మెల్యేపై లోకాయుక్త దాడులు
● 266 ఎకరాల
తోట కొనుగోలుపై కిరికిరి
యశవంతపుర: అక్రమంగా ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో చిక్కమగళూరు జిల్లా శృంగేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిడి రాజేగౌడ ఇళ్లు, ఆఫీసులపై మంగళవారం ఉదయం నుంచి లోకాయుక్త అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హొసమనె, చిక్కమగళూరు, బసాపుర, హలసూరు తదితర ప్రాంతాల్లోని ఇళ్లు, తోటలు, సన్నిహితుల ఇళ్లలో సోదాలను చేపట్టారు. అక్రమ ఆస్తుల గురించి ఎమ్మెల్యే రాజేగౌడ, భార్య పుష్పలత, విదేశాలలో ఉన్న కొడుకుపై కేసు నమోదు చేశారు. సోదాలలో అనేక పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం. బాళెహొన్నూరు సమీపంలోని హలసూరులో రాజేగౌడ 266 ఎకరాల తోటను కొన్నారు. ఇది దివంగత వ్యాపారవేత్త కాఫీ డే యజమాని సిద్ధార్థకు చెందినది. ఈ లావాదేవీలపై బీజేపీ నాయకుడు దినేశ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. రాజేగౌడ ఎన్నికల అఫిడవిట్‌లో అనేక ఆస్తులను పేర్కొనలేదని కూడా చెప్పారు. తన వార్షిక ఆదాయం రూ.38 లక్షలుగా చూపించారు. ఇదే నిజామైతే వందల ఎకరాలను ఎలా కొన్నారని దినేశ్ ఫిర్యాదులో ప్రశ్నించాడు. రెండు వారాల క్రితం ప్రజాప్రతినిధుల కోర్టు రాజేగౌడపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో కేసు పెట్టారు.
జై మహాకాళీ
తుమకూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జిల్లా దసరా ఉత్సవాల మండపంలో ప్రతిష్టించిన చాముండేశ్వరీ దేవి మంగళవారం మహాకాళి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ పూజా కై ంకర్యాల్లో హోంమంత్రి పరమేశ్వర్ సతీమణి కన్నికా పరమేశ్వర్, జిల్లాధికారి శుభ కళ్యాణ్, రజనీ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల దుస్థితిపై యమ,
చిత్రగుప్తుల ఆరా
యశవంతపుర: పర్యాటకులు ఎక్కువగా వెళ్లే చిక్కమగళూరులో రోడ్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నరక లోకం నుంచి యమ ధర్మరాజు, చిత్రగుప్తులు కాఫీనాడుకు దిగివచ్చారు, మూడిగెరె పట్టణ పరిధిలో పర్యటించారు... ఇలా వినూత్నంగా గుంతల రోడ్లపై స్థానికులు నిరసన నాటికను ప్రదర్శించారు. నీడువాళె గ్రామంలో రోడ్లు చాలా అధ్వాన్నంగా గుంతలతో నిండిపోయాయి. గ్రామ పంచాయతీ సభ్యుడు నవీన్ హవళి, కామిడి కిలాడి రమేశ్ యాదవ్‌లు వినూత్నంగా చిత్రగుప్త, యమ ధర్మరాజ వేషాలను కట్టి సంచరించారు. బైకిస్టులను అడ్డగించి ఈ రోడ్లుపై ఎలా నడుస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యంగ్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకొంది. తమ గ్రామంలోని రోడ్ల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఇలా చేసినట్లు యమ, చిత్రగుప్త తెలిపారు. వారితో జనం ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.

హస్తం ఎమ్మెల్యేపై లోకాయుక్త దాడులు

హస్తం ఎమ్మెల్యేపై లోకాయుక్త దాడులు