
అవాంతరాల నడుమ కులగణన
శివాజీనగర: పలు వివాదాల మధ్యలో కర్ణాటకవ్యాప్తంగా సోమవారం నుంచి సామాజిక విద్యా ఆర్థిక సమీక్ష (కుల గణన)కు ఆదిలోనే హంసపాదులు ఎదురయ్యాయి. శివమొగ్గలో నమోదు కిట్ల కోసం ఉపాధ్యాయులు బీఈఓ ఆఫీసుకు వచ్చినా సమయానికి అందజేయలేదు. శిక్షణ అరకొరగా ఇచ్చారని ఉపాధ్యాయులు ఆరోపించారు. మొబైల్ యాప్ ఓపెన్ కావడం లేదని పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయి. తాము ఎక్కడికి వెళ్లి సర్వే చేయాలనేది ఆదేశాలు రాలేదని మరికొందరు వాపోయారు.
సమస్య ఉండొచ్చు: మంత్రి మధు
శివమొగ్గ బీఇఓ కార్యాలయానికి వచ్చిన విద్యా మంత్రి మధు బంగారప్ప ఉపాధ్యాయులతో మాట్లాడి కిట్‌లను అందజేశారు. కుల గణన గురించి వివాదాలు ముగిశాయి, టెక్నికల్ సమస్య ఉంటే యాప్ ఓపెన్ కాదు, బళ్లారిలో కూడా యాప్‌ని ఓపెన్ చేయగా ఎరర్ అని వచ్చింది యాప్ ప్రారంభానికి అధికారులు కాచుకొని కూర్చొన్నారు. యాప్ ఓపెన్ కావడంతో గణన మొదలైంది. హావేరిలో కూడా టెక్నికల్ సమస్య ఎదురైంది. ఇళ్లకు అతికించిన యూహెచ్‌ఐడీ నంబర్‌ను మొబైల్ యాప్‌తో స్కాన్ చేస్తే ఎర్రర్ అని వచ్చిందని చెప్పారు. ఇలాంటి అవాంతరాలతో ఉపాధ్యాయులు, జనం అవస్థలు పడ్డారు.
చిత్రదుర్గలో కూడా
చిత్రదుర్గలో మంత్రి డీ సుధాకర్ సమీక్షను ప్రారంభించారు. అయితే యాప్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. హుబ్లీలో కూడా కొన్ని టెక్నికల్ సమస్యలు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులకు ఏరియాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఎవరు ఏ ప్రాంతానికి వెళ్లాలో చెప్పేవారు కరువయ్యారు. గదగ్‌లో 6,509 మంది సిబ్బంది సమీక్షలో పాల్గొన్నారు. బ్యాగ్, గణన కిట్, ఐడీ కార్డు, క్యాప్‌లు అందజేశారు.
తొందరపాటు వద్దు: కులసంఘాలు
కుల గణన తొందరపాటుతో చేస్తున్నారు, కొంతకాలం వాయిదా వేయాలి. 15 రోజుల్లో మొత్తం గణన జరిపేందుకు సాధ్యపడదు. లేదా గడువును పొడిగించాలని ఒక్కలిగ, లింగాయత్‌లు డిమాండ్ చేశారు. సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆ వర్గాల నాయకులు కలిశారు. 3 నెలల పాటు వాయిదా వేయాలని విన్నవించారు.
పలుచోట్ల యాప్ ఎర్రర్
సిబ్బందికి దిశా నిర్దేశం కరువు