
విశ్వరూప రంగోళి
మైసూరు: ౖమెసూరు నగరంలోని హుణసూరు రోడ్డులో ములకనాడు సభా భవనంలో కళాకారిణి నేహా రూపొందిన విశ్వరూప మహావిష్ణు రూపం రంగోళి కనువిందు చేస్తోంది. అనేక రంగులతో 15 అడగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ఈ రంగోళిని వేశారు.
మేలుకోటెలో నవరాత్రి వేడుకలు
●మహాలక్ష్మికి బంగారు పల్లకీ సేవ
మండ్య: మండ్య జిల్లాలోని మేలుకోటెలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ చెలువనారాయణ స్వామివారి ఆలయంలో మహాలక్ష్మి కళ్యాణ నాయకి అమ్మవారికి శరన్నవరాత్రి వేడుకలను ప్రారంభించారు. తొలిరోజు బంగారం శేషవాహనోత్సవం కనులపండువగా జరిగింది. అక్టోబర్ 1వ తేది వరకు నిత్యం మహాలక్ష్మికి పల్లకీ ఉత్సవం జరిపి శేష వాహనోత్సవం నిర్వహిస్తారు. చెలువ నారాయణ స్వామివారికి ప్రత్యేక అలంకారం, పూజలు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు.

విశ్వరూప రంగోళి