
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బొమ్మనహళ్లి: దసరా పర్వదినాల నేపథ్యంలో కర్ణాటక తెలంగాణ కల్చలర్ అసోయేషన్ (కేటీసీఎ) ఆధ్వర్యంలో బెంగళూరు నగరంలోని సీవి.రామన్ నగరలో డీఆర్‌డీఓ కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ సంబరాలు ఆనందోత్సాహాలతో జరిగాయి. ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమైన వేడుకలకు బెంగళూరు నలుమూలల నుంచి తెలంగాణ మహిళలు తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను జరుపుకొన్నారు. వివిధ రకాల పూలతో ఇంపుగా బతుకమ్మలను సిద్ధం చేసి ఇళ్ల నుంచి తీసుకువచ్చారు. మహిళలు, చిన్నారులు రంగురంగుల పట్టువస్త్రాలను ధరించి వచ్చారు. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. చన్నీటి జలకాలు ఉయ్యాలో.. ముత్యమంత పసుపు ఉయ్యాలో అని రాగయుక్తంగా పాటలు పాడుతూ లయబద్ధంగా నృత్యమాడారు. సొంతూళ్లకు వెళ్లలేకపోయినా ఇక్కడే బతుకమ్మ సంబరాలను జరుపుకొని ఆ లోటును తీర్చుకున్నట్లు పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
సిలికాన్ సిటీలో తెలంగాణ మహిళల సంప్రదాయ వైభవం

బంగారు బతుకమ్మ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో