మైసూరు: మైసూరు నగరంలోని వస్తు ప్రదర్శన ప్రాధికార ఆవరణలో దసరా కుస్తీ పోటీలను సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. ఆ వెంటనే పహిల్వాన్లు రంగంలోకి దిగారు. ప్రత్యర్థిని మట్టి కరిపించి గెలుపు కోసం పోరాడారు. సిద్దరామయ్య కూర్చుని పోటీని వీక్షించారు. చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించారు. మైసూరు వికాస్, దావణగెరె కిరణ్‌ల మధ్య అర్ధగంట సేపు కుస్తీ రంజుగా సాగింది. చివరకు మైసూరు వికాస్ గెలిచాడు. ఇక మహిళల కుస్తీ పోటీలో బెంగళూరు పుష్ప, బెళగావి నందిని తలపడ్డారు. అయితే 70 సెకెండ్లలోనే నందిని పుష్పను ఓడించింది. అలాగే అథణి సురేష్ లంకోటి, దావణగెరె హనుమంతి విఠల బేవినమర మధ్య పోటీ చాలాసేపు కొనసాగింది.
బేలూరు నిర్మానుష్యం
యశవంతపుర: హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో సిద్ది వినాయక ఆలయంలో గణేశ మూలవిరాట్టుకు ఓ మహిళ చెప్పుల హారం వేసి అవమానించడాన్ని ఖండిస్తూ సోమవారం హిందూ సంఘాలు, ప్రజలు బేలూరు బంద్‌ను నిర్వహించారు. లీలమ్మ అనే మహిళ ఈ అకృత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆమెకు మతిస్థిమితం లేదని చెబుతున్నారని, ఆమె వెనుక ఎవరున్నారో విచారణ చేయాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బంద్ విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు.
సిలికాన్ సిటీలో ఘోరం.. నడిరోడ్డుపై భార్య హత్య
యశవంతపుర: పట్టపగలే వ్యక్తి ఒకరు మహిళను 11 సార్లు కత్తితో పొడిచి చంపాడు. రేఖా అనే మహిళపై భర్త లోకేశ్ ఈ దాడికి పాల్పడ్డాడు. వివరాలు.. రేఖా తుమకూరు జిల్లా శిరా తాలూకావాసి, నాలుగు నెలల నుంచి బెంగళూరులో సుంకదకట్టలో నివాసం ఉంటుంది. ఆమె లోకేశ్ అనే వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా అనుమానంతో భార్యను వేధిస్తున్నాడు. ఆమె సోమవారం ఉదయం సుంకదకట్ట వద్ద బస్సు కోసం ఎదురు చూస్తుండగా లోకేశ్ ఆమెతో గొడవ పడ్డారు. తన జేబులోంచి కత్తిని తీసి ఎడాపెడా పొడిచాడు. రేఖా రక్తపుమడుగులో కూలిపోయింది. కొనప్రాణాలతో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
భక్తి సంగీత కచేరీ
చింతామణి: తాలూకాలోని కై వార యోగినారేయణ మఠంలో నవరాత్రి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. నాదసుధారస వేదికలో మైసూరు విద్వాన్ సుమంత్ మాళవి బృందం ఫిడేలు సంగీత కచేరీ వీనులవిందుగా సాగింది. భక్తి కీర్తనలను ఫిడేలుపై ఒలికించారు. మఠం సంకీర్తన సంచాలకులు బాలకృష్ణ భాగవతార్ మాట్లాడుతూ సంగీతం, విజ్ఞానం, ఒకే నాణేనికి రెండు ముఖాలని అన్నారు. సంగీతాన్ని నేర్చుకొంటే బుద్ధి వికసిస్తుందని అన్నారు. ధర్మాధికారి డా.జయరాం. మంజునాథ్, విభాకరరెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
చిన్నయ్య ఖాతాలకు డబ్బులు
బనశంకరి: ధర్మస్థల మీద దుష్ప్రచారం సాగించిన కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ అధికారులు ముసుగుమనిషి చిన్నయ్య అకౌంట్‌కు నగదు జమచేసిన వారికి నోటీస్‌జారీ విచారణకు హాజరుకావాలని తెలిపారు. చిన్నయ్య, అతని భార్య అకౌంట్‌కు నగదు జమచేసిన పలువురికి నోటీసులు జారీ చేశారు. బ్యాంకు ద్వారా, ఆన్‌లైన్‌లో రూ.3 లక్షల నగదును చిన్నయ్యకు పంపించినట్లు కనుగొన్నారు. ఎందుకు డబ్బులు పంపించారో తెలుసుకోనున్నారు.
కుస్తీ సమరం భళా
కుస్తీ సమరం భళా
కుస్తీ సమరం భళా