
ఖ్వాజా వెడ్స్ గాయత్రి
హుబ్లీ: జిల్లాలో మతాంతర ప్రేమపెళ్లి గొడవ వీధికెక్కింది. ఖ్వాజా మహ్మద్ బందెనవాజ్ శిరహట్టి అలియాస్ ముకుళప్ప.. గాయత్రి యల్లప్ప జాలిహాళ అనే హిందూ యువతి ప్రేమించి జూన్ మొదట్లో పెళ్లి చేసుకున్నారు. ఖ్వాజాకు ప్రముఖ యూట్యూబర్‌గా పేరుంది. ఇది లవ్ జిహాద్ అని, గాయత్రిని మోసపుచ్చి పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లిదండ్రులు, హిందూ సంఘాల నేతల ఆరోపిస్తున్నారు. ఇది లవ్ జిహాదేనని ధార్వాడ రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో తప్పుడుపత్రాలను సమర్పించి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. దీంతో పోలీసులు కొత్త జంటను పిలిపించి వివరణ తీసుకున్నారు. ఇష్టపడే పెళ్లాడినట్లు గాయత్రి చెప్పడంతో పంపించేశారు.
నా కూతురికి మాయమాటలు చెప్పాడు
గాయత్రి తల్లి శివక్క.. తన కుమార్తెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. తమ కుమార్తెను అప్పగించాలని పోలీసులను, మీడియాను ఆశ్రయించింది. ఈ తరుణంలో గాయత్రి ఓ వీడియోను విడుదల చేసింది, మా ప్రేమ సంగతి తల్లికి తెలుసు, లవ్ జిహాద్ అన్నది పచ్చి అబద్ధం, నేను సొంత నిర్ణయంతోనే అతడిని పెళ్లి చేసుకున్నాను, నా పెళ్లికి ఆమె ఒప్పుకుంది అని పేర్కొంది. ఈ పెళ్లి రగడ జిల్లాలో చర్చనీయాంశమైంది.
ధార్వాడలో మతాంతర పెళ్లి రగడ
కూతురిని అప్పగించాలని తల్లి వినతి