విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Sep 21 2025 1:23 AM | Updated on Sep 21 2025 1:23 AM

విద్య

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

హొసపేటె: కొట్టూరు రోడ్డులోని జెస్కాం కార్యాలయం సమీపంలోని టీ దుకాణం వద్ద నీటి మోటారును ఆపరేట్‌ చేయబోయిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. టీ షాప్‌ యజమాని జంపన్న పట్టణ పంచాయతీకి చెందిన నీటి పంపుసెట్‌ను నడపడానికి వెళ్లాడు. అయితే వైర్‌పై ఉన్న ఇన్సులేటర్‌ తెగిపోయి పెట్టెకు విద్యుత్‌ కనెక్షన్‌ ఉంది. వర్షం పడి నేల తడిగా ఉండటంతో మోటారు ఆన్‌ చేయడానికి వెళ్లినప్పుడు జంపన్న విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. కూడ్లిగి పీఎస్‌లో కేసు నమోదైంది.

పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలి

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటకలో అధికంగా నివసిస్తున్న పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలని దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు హనుమంతప్ప కాకరగల్‌ డిమాండ్‌ చేశారు. శనివారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధీనంలో సాగు చేస్తున్న భూములు సన్నకారు రైతులకు అవకాశమున్నా అధికారులు రైతులపై కేసు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు భూమి, ఇళ్ల పట్టాలను అందించాలని కోరుతూ ఏసీ గజాననకు వినతిపత్రం సమర్పించారు.

నమో మారథాన్‌

హొసపేటె: ప్రధాని నరేంద్ర మోదీ 75వ జయంతి వేడుకలో భాగంగా శనివారం బీజేపీ హొసపేటె మండల శాఖ ఆధ్వర్యంలో నమో మారథాన్‌ను నిర్వహించారు. రాష్ట్ర ఓబీసీ మోర్ఛా ఉపాధ్యక్షుడు అయ్యాళి తిమ్మప్ప, మండల అధ్యక్షుడు శంకర్‌ మేటి, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మధుర చెన్నశాస్త్రి, నటరాజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎం రాఘవేంద్ర, జిల్లా యువమోర్ఛా అధ్యక్షుడు కిచిడి కొట్రేశ్‌, నగర విభాగం అధ్యక్షుడు రేవణ సిద్దప్ప, పతంజలి యోగా సమితి రాజీవ్‌ కిరణ్‌, విజయకిరణ్‌, రాజేష్‌, భాజపా నాయకులు భోజరాజు, ఉమాదేవి, పూర్ణిమ, రేణుకమ్మ, రేణుక, రవి, లలిత పాల్గొన్నారు.

ఉజ్వల భవిష్యత్తుకు

ఉపాధ్యాయులే పునాది

రాయచూరు రూరల్‌: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు పునాది కావాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. శనివారం మాన్వి లయోలా పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన పురస్కార సమావేశంలో మాట్లాడారు. విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, పిల్లల సంక్షేమం కోసం పాటు పడాలన్నారు. ప్రతిభకు తార్కాణంగా తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని పిలుపు ఇచ్చారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. శాసన సభ్యుడు హంపయ్య నాయక్‌, బీఈఓ చంద్రశేఖర్‌, సురేష్‌, హంపణ్ణ, సంగమేష్‌, మహేష్‌, శివణ్ణలున్నారు.

అంగన్‌వాడీ పిల్లలకు

పౌష్టికాహారం అవసరం

రాయచూరు రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో అపౌష్టికతతో కూడిన పిల్లలకు పౌష్టికాహార పదార్ధాలను పంపిణీ చేయాలని తాలూకా శిశు అభివృద్ధి యోజనాధికారిణి వనజాక్షి పేర్కొన్నారు. శనివారం యాదగిరి జిల్లా గురుమఠకల్‌ తాలూకా కొంకల్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మాతృ వందనను జ్యోతి వెలిగించి మాట్లాడారు. వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు, కార్యకర్తలు, కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లన్న, గణాంక అధికారి యూసఫ్‌, ఉషా, ఆనంద్‌, నింగప్ప, భగవంతరెడ్డి, సాబయ్య, మారెప్ప పాల్గొన్నారు.

పేదల సమస్యలు తీరుస్తా

హొసపేటె: కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌.టీ.శ్రీనివాస్‌ శనివారం గండబొమ్మనహళ్లి చెరువు వద్ద పూర్తయిన పనులను పరిశీలించారు. చెరువు సమీపంలో నివసిస్తున్న ప్రతి ఇంటిని, ప్రజలను స్వయంగా సందర్శించి, అనేక సంవత్సరాలుగా వారిని వేధిస్తున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వ గ్రాంట్లు తీసుకు రావడం ద్వారా శాశ్వత పరిష్కారంగా ఈ చెరువు అంచున కొత్త గ్రామాన్ని నిర్మించడానికి మీ అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన అన్నారు. సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడానికి మేం పనులు ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఏఈ మంజునాథ్‌, జీపీ అధ్యక్షురాలు రత్నమ్మ హొన్నప్ప, పీడీఓ టీఎం.మంజునాథ్‌, ఉపాధ్యక్షుడు ఆర్‌.బసవరాజ్‌, జీపీ సభ్యులు చెన్నప్ప, గోవింద, సిద్దన్న పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి 1
1/2

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి 2
2/2

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement