
ఆధునిక వైద్యాన్ని అనుసరించాలి
బళ్లారి రూరల్: అధునాతన వైద్య పద్ధతులను తెలుసుకొంటూ ఉత్తమ వైద్యులుగా ఎదగాలని బెంగళూరు ప్రభుత్వ దంత వైద్య కళాశాల అండ్ రీసెర్చ్ సెంటర్(జీడీసీఆర్‌సీ) డీన్ డాక్టర్ గిరీష్ గిరద్ది తెలిపారు. శనివారం బీఎంసీఆర్‌సీ ఆవరణలోని జీడీసీఆర్‌సీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైద్య రంగం బాధ్యతాయుతమైందన్నారు. నేడు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. వైద్యులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంచుకొంటూ ఉత్తమ వైద్యులుగా రాణించాలన్నారు. ప్రస్తుతం మెడికో లీగల్ కేసులు అధికమైన నేపథ్యంలో వైద్యులకు రోగికి సరైన వైద్యం అందించాలన్నారు. యువవైద్యులకు పట్టాలను ప్రదానం చేశారు. బీఎంసీఆర్‌సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ, ప్రిన్స్‌పాల్ డాక్టర్ మంజునాథ్, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ చిదంబర మూర్తి, జీడీసీఆర్‌సీ ప్రిన్స్‌పాల్ డాక్టర్ భారతి, డాక్టర్ శ్రీనివాసమూర్తి, సీఏఓ మహేష్‌గౌడ, వైద్యులు, జూనియర్ వైద్యులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.