
విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి
బళ్లారిఅర్బన్: విద్యార్థులు తమ విద్యార్థి జీవితంలో సమయాన్ని చక్కగా చదివేందుకు ఉపయోగించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవ ప్రాధికార సభ్యత్వ కార్యదర్శి రాజేష్ నింగప్ప సూచించారు. ఆయన నగరంలోని ఇండో అమెరికన్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గురువులను గౌరవించాలన్నారు. తల్లిదండ్రులు మీపై ఎనలేని నమ్మకాన్ని పెట్టుకుని ఉంటారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వారు మిమ్మల్ని బాగా చదివిస్తారు. ఎప్పుడూ తల్లిదండ్రులకు బాధ కలిగేలా ప్రవర్తించరాదన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిలోను దివ్యనుభూతిని కల్గించాయి. ఎస్‌బీఐ అధికారిణి గుల్జార్ బేగం, కళాశాల చైర్మన్ టీహెచ్ నాయుడు, కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్ షేక్ సలీం బాషా, డిప్యూటీ ప్రిన్సిపల్ సుధీర్‌కుమార్, కేపీ కళాశాల హెచ్‌ఓడీ రాజేష్, రాజా, ఉదయ్ భాస్కర్, లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.