
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పును వెల్లడించాలి
రాయచూరు రూరల్: ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కృష్ణా ప్రాధికార తీర్పును సత్వరం కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. శనివారం చిన్న నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు జారీ చేసి ఏడాది కావస్తున్నా వాటిని అమలు పరచడంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద జోషి, సోమణ్ణ, కుమారస్వామి, శోభా కరంద్లాజెలు ముందుకు రావాలన్నారు. లేని తరుణంలో మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్ల వరకు పెంచడం, భూస్వాధీన ప్రక్రియ కూడా చేయడానికి కృష్ణా ప్రాధికార తీర్పును వెల్లడించాలన్నారు. రాష్ట్రంలో 22 నుంచి వెనుక బడిన వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న కులాల నమోదు సర్వేకు అందరు సహకరించాలని, విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు విద్య ఉద్యోగ ఇతర కుల వృత్తుల ఆధారంగా నమోదుకు సమీక్ష జరిపితే దానిని బీజేపీ కుల రాజ కీయం చేయడాన్ని మంత్రి ఖండించారు.
కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
కుల సర్వేకు అందరూ సహకరించాలి