
స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే
బనశంకరి: రానున్న జిల్లా పరిషత్, గ్రామ, తాలూకా పంచాయతీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలను ఓటింగ్ యంత్రాలకు బదులు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి మంత్రివర్గం ఆమోదించింది. ఈవీఎంలను పక్కనపెట్టాలని సిద్దరామయ్య సర్కారు నిర్ణయించడం గమనార్హం.
37 కిలోమీటర్ల మెట్రో కారిడార్
గురువారం సీఎం సిద్దరామయ్య అధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరిగింది, అందులో పలు ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. మంత్రి హెచ్‌కే.పాటిల్ విలేకరులకు భేటీ వివరాలను వెల్లడించారు. బెంగళూరు మెట్రో ఎలివేటెడ్ కారిడార్‌కు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. మెట్రో మూడో స్టేజ్ జేపీ నగర 4 వ స్టేజ్ నుంచి హెబ్బాళ వరకు, హొసహళ్లి నుంచి మాగడిరోడ్డు మార్గంగా కడబగరె వరకు 37.12 కిలోమీటర్లు పొడవు డబల్‌డెక్కర్ రైలుమార్గం నిర్మాణానికి అనుమతించారు.
● మైసూరులో ముడా స్థలాల కుంభకోణం గురించి పీఎన్.దేశాయి కమిషన్ ఇటీవల నివేదికను అందజేసింది. సీఎం సిద్దరామయ్య కుటుంబంపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నివేదిక పేర్కొన్నారని మంత్రి హెచ్‌కే.పాటిల్ తెలిపారు.
కేబినెట్ భేటీలో సర్కారు నిర్ణయం
ఈవీఎంల వాడకానికి నో
మెట్రో ఎలివేటెడ్ కారిడార్‌కు ఓకే
ఈవీఎంలు వద్దని సిఫార్సు
త్వరలో రాష్ట్రంలో జరగబోయే అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ల ఓటింగ్ పద్ధతిని పాటించాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశాం. ఈవీఎంలపై ఎంతోమంది అనుమానాలు, ఫిర్యాదులు చేస్తున్నారు. సర్కారు సిఫార్సును ఈసీ పాటించేలా అన్ని చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. అలాగే ఆ ఎన్నికల కోసం ఓటరు జాబితాలను సవరించాలని ఈసీకి సూచిస్తామని చెప్పారు.

స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే

స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే