
మళ్లీ ముంచెత్తిన వానలు
బొమ్మనహళ్లి/ శివాజీనగర: బెంగళూరు నగరంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. బొమ్మనహళ్ళి నియోజకవర్గంలోను కుండపోత వాన కురిసి లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయంగా మారాయి. హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, బొమ్మనహళ్ళి, గారెబావిపాళ్య, హొంగసంద్ర, అరికెరె, బిళ్ళెకళ్ళి, కొడిచిక్కనహళ్ళిలో పరిధిలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయంగా మారాయి. ముఖ్యంగా అరికెరె వార్డు పరిధిలోఉన్న న్యానప్పనహళ్ళి, హులిమావులోని అనేక పల్లపు ప్రాంతాల్లోకి వాననీరు చేరింది జలమయంగా మారాయి. రోడ్లుపైన కూడా వాననీరు ప్రవహించడంతో చెరువులను తలపించాయి. మాజీ కార్పొరేటర్ పురుషోత్తమ్, మురళీధర్‌లు వర్ష బాధిత ప్రాంతాలలో పర్యటించి అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని కోరారు. రాజ్‌భవన్ రోడ్డులో గాలీవానకు పెద్ద చెట్టు కూలిపోయింది. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో ఎవరికీ హాని కలగలేదు. అనేక కూడళ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
రాష్ట్రంలో వారంపాటు వర్షాలు
రాష్ట్రంలో ఈ వారాంతం వరకు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం అధికమైంది. రాష్ట్రంలో కరావళి, కళ్యాణ కర్ణాటక భాగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ బెంగళూరు కేంద్ర డైరెక్డర్ సీ.ఎస్.పాటిల్ తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల 7 వరకు యాదగిరి, కొప్పళ, బీదర్, కల్బుర్గి జిల్లాల్లో విస్తారంగా, కొన్నిచోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. కరావళి జిల్లాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలకు కుండపోత అవకాశముంది. మలెనాడు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం, ఉత్తర, దక్షిణ ఒళనాడు జిల్లాల్లో చెదురు మదురు వానలు కురిసే ఆస్కారముంది. బెంగళూరు, చుట్టుప్రక్కల జిల్లాల్లో ఆకాశం మబ్బులు కమ్ముకుని ఉంటుంది,
బెంగళూరులో కుండపోత
మరికొన్ని రోజులు వర్షసూచన
కారుపై పడిన కొమ్మ
శివమొగ్గ: కారు వెళుతున్న సమయంలో భారీ చెట్టు కొమ్మ విరిగి పడటంతో కారు స్వల్పంగా దెబ్బతింది. ఈ సంఘటన శివమొగ్గ తాలూకాలోని ఆయనూరు వద్ద చిన్నమనె గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్విఫ్ట్ కారు వెళ్తుండగా ఈదురుగాలులు వీచాయి, హఠాత్తుగా చెట్టు కొమ్మ విరిగి కారుపైన పడింది. కారులో ఉన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

మళ్లీ ముంచెత్తిన వానలు

మళ్లీ ముంచెత్తిన వానలు

మళ్లీ ముంచెత్తిన వానలు