
మైసూరు ఉత్సవాలకు రారండి
మైసూరు: మైసూరు దసరా మహోత్సవాలు ప్రారంభం కావడానికి ముందుగా జరిగే యువ సంభ్రమ వేడుకలు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మైసూరు మానస గంగోత్రిలోని బయలు రంగమందిరంలో జరుగుతాయి. యువత కోసం జరిగే ఈ ఉత్సవాలలో కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపచేయబోతున్నాయి. కన్నడ చిత్ర నటుడు అయిన యువ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నాంది పలుకుతారు. 8 రోజులపాటు సంబరాల సందడి అంబరాన్ని దాటనుంది. ఈసారి 14 థీమ్స్‌లో భాగంగా వివిధ కాలేజీలకు చెందిన 400 నుంచి 500 బృందాలు నృత్య కళా ప్రదర్శనలతో అలరిస్తాయి. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యువ సంభ్రమ సందడి కొనసాగుతుంది. మంత్రి మహాదేవయ్య, జిల్లాధికారి, ఇతర అధికారులు గురువారం సాయంత్రం బెంగళూరుకు చేరుకుని సీఎం సిద్దరామయ్యకు మైసూరు దసరా ఉత్సవాలకు ఆహ్వానం పలికారు.