
వినాయక నిమజ్జన కోలాహలం
సాక్షి,బళ్లారి: నగరంలోని వినాయక విగ్రహాల నిమజ్జనాలు పూర్తయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలో వాడవాడలా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు పూజలు చేసిన అనంతరం మంగళవారం రాత్రికి వినాయక విగ్రహాల నిమజ్జనాలు దాదాపు పూర్తి చేశారు. నగరంలోని అనంతపురం రోడ్డులోని సెంటినరీ హాలు వద్ద అంతర్జాతీయ హిందూ పరిషత్(ఏహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హిందూ మహాగణపతి ఊరేగింపును వేడుకగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమానికి వేలాది మంది జనం పాల్గొనడంతో రాజకీయ పార్టీలకతీతంగా నేతలందరూ హాజరై హిందూ మహా గణపతి ఊరేగింపులో పాల్గొని నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ రకాల వేషధారణలు వేసుకుని దారి పొడవునా కళాకారాలు నృత్యాలతో హోరెత్తించారు. హిందూ మహాగణపతి బృహత్ శోభాయాత్ర నగరంలోని పురవీధుల గుండా వేడుకగా చేపట్టారు. కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ మేయర్ మోదుపల్లి రాజేశ్వరీ, కార్పొరేటర్లు, ఏహెచ్‌పీ ప్రముఖులు, రాష్ట్ర భజరంగ్‌దళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన వినాయకుని విగ్రహాల నిమజ్జనాలు
ఆకట్టుకున్న హిందూ మహాగణపతి శోభాయాత్ర

వినాయక నిమజ్జన కోలాహలం